Indian IPOs: ఐపీఓల సంచలనం.. ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్లు!
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐపీఓల (ప్రారంభ పబ్లిక్ ఆఫర్) ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఎన్నడూ లేనంతగా సంస్థలు బహిరంగ ఇష్యూ ద్వారా భారీ మొత్తంలో నిధులు సమీకరిస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ కావడం విశేషం. 2024 ముగిసే ముందే ఈ ఐపీఓలు కొత్త రికార్డును నమోదు చేశాయి. ప్రస్తుతం ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తం నిధులు రూ.1.22 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2021లో రూ.1.18 లక్షల కోట్ల రికార్డును అధిగమించాయి. ఆగస్టులో రూ.17,109 కోట్లు, సెప్టెంబరులో రూ.11,058 కోట్లు, అక్టోబరులో రూ.38,700 కోట్లతో నిధుల సమీకరణ జరిగాయి.
కొంతమంది మదుపరులకు నిరాశ
వచ్చే నెలలో స్విగ్గీ, సగలిటీ ఇండియా, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్, నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పెద్ద కంపెనీలు సుమారు రూ.19,334 కోట్ల సమీకరణ లక్ష్యంతో మార్కెట్లోకి రానున్నాయి. కొన్ని కంపెనీలు లాభాలను అందిస్తే, మరికొన్ని మదుపరులకు నిరాశ కలిగించాయి. హ్యుందాయ్ మోటార్, గరుడ కన్‌స్ట్రక్షన్ వంటి కొన్ని కంపెనీలు డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నప్పటికీ, వారీ ఎనర్జీస్ మంచి లాభాలను అందించింది. అయితే విదేశీ సంస్థాగత మదుపర్ల నిధుల వెనుక సమీకరణ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.