Swiggy: కుదేలైన స్విగ్గీ షేర్లు.. రూ.40,250 కోట్లు ఆవిరి!
ఈ వార్తాకథనం ఏంటి
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు ఆశించిన మేరకు లేకపోవడంతో, కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో వరుసగా పతనమవుతున్నాయి.
కొన్ని బ్రోకరేజ్ సంస్థలు స్విగ్గీ రేటింగ్‌ను తగ్గించడంతో ఇన్వెస్టర్ల నమ్మకం దెబ్బతింది.
సోమవారం ట్రేడింగ్‌లో స్విగ్గీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇప్పటివరకు కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.40,250 కోట్లు తగ్గింది.
సోమవారం ట్రేడింగ్‌లో స్విగ్గీ షేరు ధర 6 శాతానికి పైగా క్షీణించింది. బీఎస్‌ఈలో రూ.359 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.
కొన్ని రోజులుగా స్విగ్గీ షేర్లు నష్టాల బాటలోనే పయనిస్తూ ఇష్యూ ధర రూ.390 కంటే దిగువకు పడిపోయాయి. ఫిబ్రవరి ప్రారంభం నుంచి ఇప్పటివరకు కంపెనీ రూ.40,235 కోట్ల మార్కెట్ విలువ కోల్పోయింది.
Details
స్విగ్గీ ఇన్వెస్టర్లకు నిరాశ
మధ్యాహ్నం సమయంలో ఎన్‌ఎస్‌ఈలో స్విగ్గీ షేర్లు 4.64% తగ్గి రూ.363.50 వద్ద ట్రేడ్ అవ్వగా, బీఎస్‌ఈలో 4.61% పతనమై రూ.363.45 వద్ద కొనసాగుతున్నాయి.
ఫిబ్రవరి మొదటివారంలో స్విగ్గీ తన Q3 త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.799 కోట్లుగా నమోదైంది.
గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.574 కోట్ల నష్టంతో పోలిస్తే ఇది 39% పెరిగింది. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం 31% వృద్ధితో రూ. 3,049 కోట్ల నుంచి రూ. 3,993 కోట్లకు పెరిగింది.
స్టాక్ మార్కెట్‌లో షేర్ల క్షీణత, పెరిగిన నష్టాలతో స్విగ్గీ ఇన్వెస్టర్లకు నిరాశను మిగిల్చింది. సంస్థ భవిష్యత్తు పనితీరు, వ్యాపార వ్యూహాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని తిరిగి పొందడంలో కీలకంగా మారనున్నాయి.