Stock market: మూడో రోజూ దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. లాభాల్లో ముగిసిన సూచీలు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఉన్న ఆశావహ దృక్పథం సూచీలకు బలం చేకూర్చాయి. అలాగే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్‌కు అనుకూలించింది. ఈ నేపథ్యంలో సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు మంచి ప్రదర్శన చూపించాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 750 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టి 50 24,550 స్థాయి ఎగువన ముగిసింది.
వివరాలు
మార్కెట్ గణాంకాలు
సెన్సెక్స్ 78,617.16 వద్ద (క్రితం ముగింపు 78,520.30) లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 79,367.08 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 753.03 పాయింట్ల లాభంతో 79,273.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 211.75 పాయింట్లు పెరిగి 24,576.60 వద్ద స్థిరపడింది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు పడిపోగా, రూ.93.49గా నమోదైంది.
వివరాలు
లాభాలు, నష్టాలు
సెన్సెక్స్ సూచీలో ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో నిలిచాయి. ఇక బీఈఎల్, టైటాన్, రిలయన్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రపంచ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 94.70 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర 4,781 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా గ్లోబల్ అనుకూల సంకేతాలు, చమురు ధరల తగ్గుదల దేశీయ మార్కెట్లకు బలాన్నిచ్చి, వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగియడానికి దోహదపడ్డాయి.