FY25కి భారతదేశ వృద్ధి అంచనాను 7శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 03, 2024
01:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు సెప్టెంబర్ 3న 6.6% నుండి 7%కు పెంచింది. ఎఫ్‌వై 24లో 8.2% వృద్ధితో భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ప్రస్తుతం కూడా భారతదేశం మంచి వృద్ధి ప్రదర్శనతో కొనసాగుతోందని, భారతదేశ కంట్రీ డైరెక్టర్ అగస్టే టానో కౌమే తెలిపారు. భారతదేశం తన ఎగుమతి బాస్కెట్‌ను వైవిధ్యపరచడం అవసరమని, 2030 నాటికి $1 ట్రిలియన్ సరుకుల ఎగుమతులను చేరుకోవడానికి ప్రపంచ విలువ గొలుసులను పెంచుకోవాలని కౌమే పేర్కొన్నారు.