SBI in Canada: కెనడాలో ఎస్‌బీఐకి ఎలాంటి అంతరాయం లేదు.. చీఫ్ ప్రకటన
కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భారతీయ స్టేట్ బ్యాంక్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. భారత-కెనడా సంబంధాలు క్షీణిస్తున్నప్పటికీ, ఎస్‌బీఐ కెనడాలో తన సేవలను యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపింది. అక్కడి వ్యాపార కార్యకలాపాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని బ్యాంకు తెలిపింది. కెనడాలోని మా సేవలు 1982 నుండి ప్రారంభమై, అక్కడ తాము ఒక స్థానిక బ్యాంక్‌గా పరిగణించామని ఎస్‌బీఐ ఛైర్మన్, సీఎస్ శెట్టి పేర్కొన్నారు. వినియోగదారులు, నియంత్రణ సంస్థల విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు.
8 బ్రాంచ్ ల ద్వారా సేవలు
తమ కార్యకలాపాలు స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఉంటాయని పేర్కొన్నారు. SBI కెనడాలోని టొరంటో, బ్రాంప్టన్, వాంకోవర్ సహా 8 బ్రాంచ్‌ల ద్వారా సేవలు అందిస్తోంది. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు గత ఏడాది కాలంగా ఉద్రిక్తంగా ఉంటే, ఇటీవల కెనడా భారత దేశ దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేయడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఇరు దేశాల మధ్య వ్యవహారాల్లో మరిన్ని మార్పులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి