LOADING...
New Rules: 2026లో ఆర్ధిక మార్పులు: కొత్త సంవత్సరం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందంటే?
2026లో ఆర్ధిక మార్పులు: కొత్త సంవత్సరం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందంటే?

New Rules: 2026లో ఆర్ధిక మార్పులు: కొత్త సంవత్సరం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

మరొక వారంలో 2025 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరం ప్రవేశించడానికి అందరూ ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్‌ను ఆనందంగా జరుపుకునేందుకు ప్రతీ ఒక్కరూ వేర్వేరు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొందరు ఫ్రెండ్స్, కుటుంబసభ్యులందరితో కలిసి టూర్‌లు ప్లాన్ చేస్తూ ఉంటే, మరికొందరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని గ్రూపులు ఇప్పటికే ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం వస్తుందన్న వార్తతో అందరిలోనూ ఒక కొత్త ఉత్సాహం, స్ఫూర్తి కలుగుతుంది. కొత్త ఏడాదిలో చేయవలసిన పనుల కోసం ప్రతీ ఒక్కరు లక్ష్యాలను నిర్ణయించుకుంటారు.

వివరాలు 

క్రెడిట్ రిపోర్ట్‌లో మార్పులు 

కేవలం ఉత్సాహం మాత్రమే కాదు, కొత్త సంవత్సరం ఆర్ధికంగా మన జీవితాలను ప్రభావితం చేసే పలు మార్పులను కూడా తీసుకొస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల నుండి జీతాల వరకు 2026లో ఏ విధమైన మార్పులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 నుండి క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్లలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు బ్యాంకులు 15 రోజులకు ఒకసారి ఈ అప్డేట్ చేసేవి, కొత్త సంవత్సరం నుంచి వారానికి ఒకసారి చేయాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం, దీని వల్ల సిబిల్ స్కోర్ మరింత పారదర్శకంగా ఉంటుంది. రుణాలు పొందడం సులభతరం అవుతుంది. అలాగే, మోసపూరితంగా రుణాలు పొందే వారిపై కూడా ఇది చెక్‌ పడుతుందని అంటోంది.

వివరాలు 

సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి 

సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న క్రమంలో, కేంద్ర ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. భాగంగా, సోషల్ మీడియా యాప్‌లకు కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి సోషల్ మీడియా యాప్‌లు వాడాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి అవుతుంది. సిమ్ వెరిఫికేషన్ చేసినవారే వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్‌లు వాడగలుగుతారు. ఈ మార్పు కొత్త సంవత్సరం నుండే అమలు చేయబడనుంది.

Advertisement

వివరాలు 

ప్రభుత్వ ఉద్యోగులకు పండగ 

జనవరి 1 నుండి 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. దీని ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మార్పులు రానున్నాయి. 2026 నుండి ఉద్యోగుల డీఏ(Dearness Allowance)కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల కనీస వేతనాలను పెంచడానికి సిద్దమవుతున్నాయి, కొత్త సంవత్సరం ప్రారంభం తోనే వీటిని అమలు చేస్తాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతీ నెల 1వ తేదీని వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు కనిపిస్తాయి.ఆ రోజున ఆయిల్ కంపెనీలు కొత్త రేట్లను ప్రకటిస్తాయి. గత నెలలో వాణిజ్య గ్యాస్ ధరలను కొంచెం తగ్గించారు. ఇప్పుడు, జనవరి 1 నుండి కొత్త ఏడాదిలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉంటాయో చూడవలసి ఉంది.

Advertisement