Richest Indians: భారత్‌లో అత్యంత ధనవంతులు వీరే.. టాప్ 10లో ఒక మహిళ మాత్రమే!
దేశంలోని ధనవంతులపై నివేదికలను ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తరచూ విడుదల చేస్తుంటాయి. తాజాగా ఫోర్బ్స్ 2024 రిచెస్ట్ ఇండియన్స్ జాబితా విడుదలైంది. ఇందులో టాప్-100 భారతీయుల సంపద కలిపి 1.1 ట్రిలియన్ డాలర్లను మించిపోయింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.92 లక్షల కోట్లుగా ఉంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్నారు. ఆయన సంపద 119.5 బిలియన్ డాలర్లు. ఇది సుమారు రూ.10 లక్షల కోట్ల రూపాయలు. రెండో స్థానంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు, ఆయన సంపద 116 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాదిలో ఆయన సంపద 48 బిలియన్ డాలర్లు పెరిగినట్లుగా ఫోర్బ్స్ పేర్కొంది.
పదో స్థానంలో బజాబ్ గ్రూప్
టాప్-10 భారతీయ ధనవంతుల జాబితాలో ఒక్క మహిళ మాత్రమే ఉండడం విశేషం. ఆమె సావిత్రి జిందాల్ 4) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ శివ్ నాడార్- 40.2 బిలియన్ డాలర్లు 5) సన్ ఫార్మాస్యుటికల్స్ దిలీప్ సంఘ్వీ & ఫ్యామిలీ- 32.4 బిలియన్ డాలర్లు 6) డీమార్ట్ ఫౌండర్ & ఛైర్మన్ రాధాకిషన్ దమానీ- 31.5 బిలియన్ డాలర్లు 7) భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఫౌండర్ & ఛైర్మన్ సునీల్ మిట్టల్ & ఫ్యామిలీ - 30.7 బిలియన్ డాలర్లు 8) ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్- 24.8 బిలియన్ డాలర్లు 9) సైరస్ పూనావాలా గ్రూప్ ఛైర్మన్ - 24.5 బిలియన్ డాలర్లు 10) బజాజ్ గ్రూప్ బజాజ్ ఫ్యామిలీ- 23.4 బిలియన్ డాలర్లు