LOADING...
UAE lottery : అదృష్టం తలుపు తట్టడడం ఇదేనేమో..! యూఏఈలో 29 ఏళ్ల భారతీయుడికి రూ.240 కోట్ల లాటరీ
అదృష్టం తలుపు తట్టడడం ఇదేనేమో..! యూఏఈలో 29 ఏళ్ల భారతీయుడికి రూ.240 కోట్ల లాటరీ

UAE lottery : అదృష్టం తలుపు తట్టడడం ఇదేనేమో..! యూఏఈలో 29 ఏళ్ల భారతీయుడికి రూ.240 కోట్ల లాటరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

యూఏఈ లాటరీ చరిత్రలో రికార్డులు తిరగరాసిన అదృష్టవంతుడు భారతీయుడు. అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల భారతీయ ప్రవాసి అనిల్‌కుమార్ బోళ్ల మాధవరావ్ బోళ్ల రూ.240 కోట్లు (Dh100 మిలియన్) విలువైన జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. ఇది ఇప్పటివరకు యూఏఈలో ఇచ్చిన అత్యంత పెద్ద లాటరీ బహుమతిగా నిలిచింది. దక్షిణ భారతానికి చెందిన ఈ యువకుడు తన అదృష్టాన్ని నమ్మలేకపోతున్నాడు. ఈ అదృష్ట అక్టోబర్ 18న జరిగిన 23వ 'లక్కీ డే' ఈవెంట్‌లో చోటుచేసుకుంది. 8.8 మిలియన్ల టికెట్ హోల్డర్లలో ఒక్కరైన అనిల్‌కుమార్‌ ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు.

Details

టికెట్ ఎంపిక వెనుక కథ

యూఏఈ లాటరీ సంస్థ సోమవారం విడుదల చేసిన వీడియోలో ఈ వార్తను అధికారికంగా ప్రకటించింది. ఉత్కంఠ నుంచి ఉత్సవం వరకు! ఈ ఒక్క ప్రకటన అన్నింటినీ మార్చేసిందని యూఏఈ లాటరీ సంస్థ ఎక్స్‌లో పోస్టు చేసింది. అనిల్‌కుమార్‌ Dh100 మిలియన్‌ గెలిచారు! అక్టోబర్ 18 ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చిన రోజు అని పేర్కొంది. యూఏఈలోకి కేవలం ఏడాదిన్నర క్రితమే వచ్చిన అనిల్‌కుమార్‌, ఈ లాటరీ టికెట్‌ను 'ఈజీ పిక్‌' ఆప్షన్‌ ద్వారా కొనుగోలు చేశానని తెలిపారు. డేస్ సెట్‌లో నంబర్లు కంప్యూటర్ ఆటోమేటిక్‌గా ఎంచుకున్నా, 'మంత్స్ సెట్' నుంచి మాత్రం తన తల్లి పుట్టిన నెల గౌరవార్థం 11వ నంబర్‌ను కావాలనే ఎంపిక చేసుకున్నానని చెప్పారు.

Details

 నేను ఏ మ్యాజిక్ చేయలేదు

నేను ఏ మ్యాజిక్ చేయలేదు, కేవలం ఈజీ పిక్‌ ఎంచుకున్నాను. కానీ చివరి నంబర్‌ మాత్రం నాకు చాలా ప్రత్యేకం. ఒకే లావాదేవీలో 12 టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు కూడా వెల్లడించారు. బహుమతిని ఎలా ఉపయోగించనున్నాడు? అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ, ఈ భారీ మొత్తాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాలనుకుంటున్నానని చెప్పారు. డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టి, సమర్థవంతంగా ఉపయోగించాలనుకుంటున్నానని అన్నారు. వ్యక్తిగతంగా, ఒక సూపర్‌కార్‌ కొనుగోలు చేయడం, ఒక లగ్జరీ రిసార్ట్‌లో విజయాన్ని గ్రాండ్‌గా జరుపుకోవడం, కుటుంబాన్ని యూఏఈకి తరలించడం వంటి ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.