LOADING...
TikTok Founder Zhang Yiming: ముకేశ్ అంబానీని దాటేసిన టిక్‌టాక్ వ్యవస్థాపకుడు.. ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడు!
ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడు!

TikTok Founder Zhang Yiming: ముకేశ్ అంబానీని దాటేసిన టిక్‌టాక్ వ్యవస్థాపకుడు.. ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

టిక్‌ టాక్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ సంపదలో భారీ వృద్ధి సాధించి ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని వెనక్కి నెట్టారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ఝాంగ్ యిమింగ్ నికర సంపద 92.8బిలియన్ డాలర్లకు చేరుకోగా,ముకేశ్ అంబానీ 86.9బిలియన్ డాలర్ల సంపదతో మూడోస్థానంలో ఉన్నారు. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 117బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ మార్కెట్ విలువ గణనీయంగా పెరగడం,అలాగే కృత్రిమ మేధ (ఏఐ)రంగంలో సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై పెట్టుబడిదారులు విశ్వాసం వ్యక్తం చేయడంతో ఝాంగ్ యిమింగ్ సంపద వేగంగా పెరిగిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.

వివరాలు 

2012లో బైట్‌డ్యాన్స్ సంస్థను స్థాపించిన ఝాంగ్ యిమింగ్

2019 మార్చి నాటికి ఆయన నికర సంపద 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఏడేళ్లలో అది ఏడు రెట్లకు పైగా పెరగడం విశేషం. ఇటీవల బైట్‌డ్యాన్స్ అభివృద్ధి చేసిన 'డౌబావో' ఏఐ చాట్‌బాట్ చైనాలో విస్తృత ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం దీని నెలవారీ వినియోగదారుల సంఖ్య 300 మిలియన్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం. ఈ విజయంతో కంపెనీ భవిష్యత్ వృద్ధిపై పెట్టుబడిదారుల్లో మరింత ఆశావాదం పెరిగింది. ఝాంగ్ యిమింగ్ 2012లో బైట్‌డ్యాన్స్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా 'టౌషియావో' అనే మీడియా అగ్రిగేటర్‌తో పాటు 'డౌయిన్' అనే వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. అనంతరం అదే డౌయిన్ అంతర్జాతీయ మార్కెట్‌లో 'టిక్‌టాక్' పేరుతో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందింది.

వివరాలు 

అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలపై తీవ్ర చర్చ

కొద్ది కాలం క్రితం అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలపై తీవ్ర చర్చ సాగింది. చివరికి బైట్‌డ్యాన్స్ సంస్థ అమెరికాలోని తమ వ్యాపార కార్యకలాపాలను ఒరాకిల్ నేతృత్వంలోని కన్సార్షియంకు బదిలీ చేసింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం సంస్థ కృత్రిమ మేధ రంగంపై భారీగా పెట్టుబడులు కేటాయిస్తోంది. ఈ ఏడాది ఏఐ అభివృద్ధి కోసం సుమారు 70 బిలియన్ డాలర్లు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement