
ToDay Gold Rate: గోల్డ్ లవర్స్ కి శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిపోయింది. నిజానికి, బంగారం ధరలు నెల,నెలకు విపరీతంగా పెరుగుతూనే పోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర సుమారు ₹1,18,000 కంటే ఎక్కువ స్థాయిలో ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో ధర మరింత పెరగవచ్చనే అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ కథనం ప్రకారం ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వివరాలు
భాగ్య నగరంలో నిన్న బంగారం ధరలు ఇలా..
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,18,690 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹1,08,800 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ₹89,020 వద్ద ట్రేడ్ అయింది. నిన్నటితో పోలిస్తే, పది గ్రాముల బంగారంపై గ్రాముకు సుమారు ₹1 (మొత్తం ₹10) తగ్గుదల నమోదైంది. ఇప్పటి ధరలు: 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం: ₹1,18,680 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం: ₹1,08,790 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం: ₹89,010 వద్ద ట్రేడ్ అవుతోంది.
వివరాలు
వెండి ధరలు:
హైదరాబాద్ మహానగరంలో నిన్న వెండి ధరలు ఇలా ఉన్నాయి: కేజీ వెండి ధర ₹1,64,000 వద్ద ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర ₹16,400 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు కేజీ వెండి ధర ₹100 పెరిగి ₹1,64,100కు చేరింది. అలాగే, 100 గ్రాముల వెండి ధర ₹10 పెరుగుతూ ₹16,410కు చేరింది.