Gold Rates: మరోసారి షాకిచ్చిన పసిడి, వెండి ధరలు.. ఏకంగా ఎంత పెరిగిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనడం అనేది సాంప్రదాయంగా మారిపోయింది. ముఖ్యంగా మన దేశంలో పసిడి అంటే ప్రత్యేకమైన అభిమానమే. ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో అనూహ్యమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు రేట్లు తగ్గి వినియోగదారులకు ఊరటనిస్తే, మరుసటి రోజు మళ్లీ పెరిగి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు రెండు రోజులుగా కొంత తగ్గినా, మళ్లీ పెరుగుదల దిశగా ప్రయాణం ప్రారంభించాయి. దీంతో బంగారం అభిమానులు కొద్దిసేపు ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ ధరలు పెరగడం ప్రారంభమైంది.
వివరాలు
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు
ఈ నేపథ్యంలో నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,000గా ఉండగా, నేడు రూ.170 పెరిగి రూ.1,23,170కు చేరింది. అదే విధంగా, 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.1,12,750గా ఉండగా, నేడు రూ.150 పెరిగి రూ.1,12,900కు చేరుకుంది. అంతేకాక, వెండి ధర కూడా రూ.2,000 పెరిగి కిలోకు రూ.1,68,000గా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి.
వివరాలు
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,12,900 24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,23,170 నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే? 22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,12,900 24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,23,170