Loading...
AI Costs: ఉద్యోగి కంటే ఏఐకే ఎక్కువ ఖర్చు.. టాప్‌ కంపెనీల్లో ఒక్కొక్కరిపై రూ.7 లక్షలు!
ఉద్యోగి కంటే ఏఐకే ఎక్కువ ఖర్చు.. టాప్‌ కంపెనీల్లో ఒక్కొక్కరిపై రూ.7 లక్షలు!

AI Costs: ఉద్యోగి కంటే ఏఐకే ఎక్కువ ఖర్చు.. టాప్‌ కంపెనీల్లో ఒక్కొక్కరిపై రూ.7 లక్షలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐ వినియోగం విస్తరిస్తున్న కొద్దీ కంపెనీలపై ఆర్థిక భారం కూడా గణనీయంగా పెరుగుతోంది. అమెరికాలోని టాప్‌ 1 శాతం కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై ఏఐ టూల్స్‌ కోసం సగటున రూ.7 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాయి. ర్యాంప్‌ ఏఐ ఇండెక్స్‌ తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. జనవరిలో ఇదే సంస్థలు ఒక్కో ఉద్యోగిపై సుమారు రూ.2.47 లక్షలు వెచ్చించాయి. అంటే కొద్ది నెలల వ్యవధిలోనే ఏఐపై కంపెనీల వ్యయం దాదాపు మూడు రెట్లు పెరిగింది.

వివరాలు 

టాప్‌ సంస్థలకే అధిక వ్యయం..

ఏఐ వినియోగం విషయంలో కంపెనీల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

టాప్‌ 10 శాతం కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై సుమారు రూ.62 వేల వరకు ఏఐ కోసం ఖర్చు చేస్తున్నాయి.

అన్ని కంపెనీలను కలిపి చూస్తే మాత్రం ఒక్కో ఉద్యోగిపై సగటు వ్యయం కేవలం రూ.1,140గా ఉంది.

దీంతో ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న సంస్థలకు, పరిమిత స్థాయిలో వినియోగిస్తున్న కంపెనీలకు మధ్య వ్యత్యాసం వేగంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది.

వివరాలు 

టోకెన్ల వినియోగంతో పెరుగుతున్న బిల్లులు..

ఏఐ సేవలపై ఖర్చులు పెరగడానికి టోకెన్‌ ఆధారిత చార్జీలు కూడా ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఏఐతో ఎక్కువ పనులు చేయిస్తే ఎక్కువ టోకెన్లు వినియోగమవుతాయి.

దానికి అనుగుణంగా కంపెనీల బిల్లులు కూడా పెరుగుతున్నాయి. దీంతో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులు ఏఐని ఉపయోగించే విధానంపై పరిమితులు విధిస్తున్నాయి.

ఉబర్‌, అమెజాన్‌, వాల్‌మార్ట్‌ వంటి కంపెనీలు టోకెన్ల వినియోగానికి పరిమితులు పెట్టినట్లు నివేదిక తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

వ్యాపార సంస్థల్లో ఆంత్రోపిక్‌దే ఆధిక్యం..

వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగం విషయంలో ఆంత్రోపిక్‌ 43.5 శాతం వాటాతో ముందంజలో ఉంది.

39.7 శాతం వాటాతో ఓపెన్‌ఏఐ రెండో స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో ఓపెన్‌ సోర్స్‌, చైనా ఏఐ మోడళ్లను అందించే ప్లాట్‌ఫామ్‌ల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది.

జులైలో ఈ ప్లాట్‌ఫామ్‌ల వాటా 6.1 శాతానికి చేరింది. అయితే ఏఐని భారీగా వినియోగిస్తున్న కంపెనీల్లో ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ సేవలపై చేస్తున్న ఖర్చు మాత్రం తగ్గలేదని ర్యాంప్‌ ఏఐ ఇండెక్స్‌ నివేదిక స్పష్టం చేసింది.

అంటే ప్రత్యామ్నాయ ఏఐ మోడళ్ల వినియోగం పెరుగుతున్నప్పటికీ, ప్రముఖ ఏఐ సంస్థలపై కంపెనీల వ్యయం కొనసాగుతోందని అర్థమవుతోంది.

ADVERTISEMENT