TRAI Spam Calls: స్పామ్ కాల్స్‌కు ట్రాయ్ భారీ షాక్.. లక్షల కనెక్షన్లపై వేటు!
ఈ వార్తాకథనం ఏంటి
స్పామ్ కాల్స్, నకిలీ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) చర్యలను ముమ్మరం చేసింది. వాణిజ్య కమ్యూనికేషన్ (UCC) నిబంధనలను ఉల్లంఘించినందుకు జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 1.24 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్లపై ఆంక్షలు విధించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన 374 సంస్థలను ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
వివరాలు
1.10 లక్షల కనెక్షన్లపై 15 రోజుల ఆంక్షలు
2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన నివేదికలో ట్రాయ్ ఈ వివరాలను వెల్లడించింది.
మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన 1,10,325 మొబైల్ కనెక్షన్లను 15 రోజుల పాటు అవుట్‌గోయింగ్ సేవల నుంచి నిలిపివేసింది.
పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన మరో 13,777 కనెక్షన్లను ఏడాది పాటు డిస్‌కనెక్ట్ చేసింది. వీటితో పాటు 3,725 ఎస్‌ఎంఎస్ హెడర్లను కూడా ఏడాది పాటు బ్లాక్ చేసింది.
వివరాలు
స్పామ్‌పై 15.29 లక్షల ఫిర్యాదులు
ఈ త్రైమాసికంలో స్పామ్ కమ్యూనికేషన్లకు సంబంధించి ట్రాయ్‌కు 15.29 లక్షల ఫిర్యాదులు అందాయి.
వీటిలో 7.23 లక్షల ఫిర్యాదులను చర్యలు తీసుకోదగినవిగా వర్గీకరించినట్లు సంస్థ వెల్లడించింది.
వినియోగదారులు ట్రాయ్ డీఎన్‌డీ యాప్ (TRAI DND App) ద్వారా ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు చేసినట్లు తెలిపింది.
వివరాలు
19.9 బిలియన్ల కాల్స్, మెసేజ్‌లు గుర్తింపు
స్పామ్ కాల్స్‌ను అడ్డుకునేందుకు టెలికాం ఆపరేటర్లు ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు ఈ త్రైమాసికంలో 19.9 బిలియన్ల ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను అనుమానిత స్పామ్‌గా గుర్తించినట్లు ట్రాయ్ పేర్కొంది.
ప్రచార కాల్స్‌కు ప్రత్యేక నంబరింగ్ సిరీస్‌లు
ప్రచార కాల్స్, సేవలు, లావాదేవీలకు సంబంధించిన కమ్యూనికేషన్లను వినియోగదారులు సులభంగా గుర్తించేందుకు ట్రాయ్ ప్రత్యేక నంబరింగ్ సిరీస్‌లను ప్రవేశపెట్టింది.
ఇందులో ప్రచార కాల్స్ 140 సిరీస్ కింద, సేవలు, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ 1600 సిరీస్ కింద వస్తాయని వెల్లడించింది.