Nvidia: ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు.. రెండేళ్లలోనే భారీగా పెరిగిన షేర్ల విలువ!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా చిప్ తయారీ దిగ్గజ సంస్థ నివిడియా(Nvidia) షేర్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తున్నాయి. ఈ సంస్థ షేర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. గత రెండేళ్లలో ఎన్విడియాలో ట్రంప్ పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నాయి. వాషింగ్టన్ పోస్టు కథనం ప్రకారం.. 2024 ఏడాది చివరి నాటికి ఎన్విడియాలో ట్రంప్‌నకు 6.15 లక్షల డాలర్ల నుంచి 13 లక్షల డాలర్ల వరకు విలువైన షేర్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న వాటాల విలువ 13 మిలియన్ డాలర్ల నుంచి 62 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.
వివరాలు
చివరి రెండు నెలలకు సంబంధించిన లావాదేవీలు లేవు
ఇటీవల ట్రంప్ వెల్లడించిన ఆర్థిక కార్యకలాపాల వివరాల్లో.. చివరి రెండు నెలలకు సంబంధించిన లావాదేవీలు మాత్రం లేవని తెలిపింది.
చైనాకు చిప్‌ల సరఫరా, అమెరికా అధ్యక్షుడి కార్యవర్గానికి ఎన్విడియాతో ఉన్న సంబంధాలపై విమర్శలు వస్తున్న సమయంలో ట్రంప్ తన పెట్టుబడుల వివరాలను వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా.. ఎన్విడియా చుట్టూ నెలకొన్న వివాదాల్లో సంస్థ మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధాల అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
చివరి రెండు నెలలకు సంబంధించిన లావాదేవీలు లేవు
మరోవైపు.. ఎన్విడియాతో పాటు మరో రెండు డజన్ల కంప్యూటర్ చిప్‌ల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి చెందిన సంస్థలను జాతీయ స్థాయి కీలక సంస్థలుగా (National Champions) ప్రకటించేందుకు ట్రంప్ కార్యవర్గం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది.
కాగా.. ఎన్విడియా మంగళవారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.