ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు
గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అని పిలిచే "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్లాన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు గత నెలలో ట్విట్టర్ తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ బ్రాండ్‌ల ఖాతాల పేరు పక్కన గోల్డ్ చెక్ గుర్తు కోసం నెలకు $1,000 వసూలు చేయాలని ఆలోచిస్తుంది. వ్యాపారులకు ట్విట్టర్ కొత్త చెల్లింపు ప్రణాళిక వివరాలను సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా వివరించారు. నగదు కొరతతో ట్విట్టర్ కొత్త ఆదాయ మార్గాల కోసం వెతుకుతోంది. జనవరిలో, కంపెనీ ఆదాయం 40% తగ్గింది. ఈ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను ఆదాయ మార్గాలలో ఒకటిగా సంస్థ భావిస్తుంది. ట్విట్టర్ ధరను ఇంకా ఖరారు చేయలేదు. ధర మారే అవకాశం, మరి కొన్ని నిబంధనలు ఇందులో చేరే అవకాశం కనిపిస్తుంది.
అనుబంధ సంస్థలకు గోల్డ్ బ్యాడ్జ్‌తో పాటు చిన్న స్క్వేర్ బ్యాడ్జీ కూడా వస్తుంది
తగ్గుతున్న ట్విటర్ ప్రకటన రాబడిని ఈ ఖరీదైన సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీతో సరిచేద్దాం అని కంపెనీ యజమాని ఎలోన్ మస్క్ భావిస్తున్నారు. అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం ట్విట్టర్ నెలకు $50 వసూలు చేస్తుంది. వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్‌లో చేరడానికి ట్విట్టర్ ప్రారంభ యాక్సెస్ వెయిట్‌లిస్ట్‌ను జనవరిలో ప్రారంభించింది. ట్విట్టర్ డిసెంబర్‌లో వ్యాపారాల కోసం గోల్డ్ చెక్‌మార్క్‌లను అమలు చేసింది. సబ్‌స్క్రిప్షన్ సేవలో చేరిన సంస్థలు ఆ సంబంధిత వ్యక్తులు, వ్యాపారాలు, బ్రాండ్‌లను ప్రాథమిక ఖాతా కింద లింక్ చేసుకోవచ్చు. ప్రాథమిక ఖాతాలకు గుండ్రటి గోల్డ్ బ్యాడ్జ్ లభిస్తే, అనుబంధ సంస్థలు బంగారు బ్యాడ్జ్ తో పాటు పేరెంట్ సంస్థకు చెందిన చిన్న స్క్వేర్ బ్యాడ్జ్‌తో ఉంటాయి.