
థ్రెడ్స్ వర్సెస్ ట్విట్టర్: థ్రెడ్స్ లింక్స్ కనిపించకుండా చేస్తున్న ట్విట్టర్; అసలేం జరుగుతోందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ కు పోటీగా మెటా నుండి థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాప్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్, థ్రెడ్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.
తాజాగా ట్విట్టర్ లో థ్రెడ్స్ లింక్స్ కనిపించడం లేదు. సాధారణంగా ట్విట్టర్ లో ఏ వెబ్ సైట్ గురించైనా సెర్చ్ చేయాలనుకుంటే URL: ని ఉపయోగిస్తారు.
అంటే, URL:Facebook.com అని టైప్ చేస్తే ఫేస్ బుక్ సంబంధిత లింక్స్ అన్నీ ట్విట్టర్ లో కనిపిస్తాయి. ఈ ఆప్షన్ థ్రెడ్స్ కి పనిచేయడం లేదు.
మీరు URL:Threads.net అని టైప్ చేస్తే థ్రెడ్స్ కి సంబంధించిన ఒక్క లింక్ కూడా రావట్లేదని బిజినెస్ ఇన్ సైడర్ రాసుకొచ్చింది.
Details
URL:Threads.net కి బదులు URL:Threads net
కేవలం Threads.net అని టైప్ చేస్తే థ్రెడ్స్ లో జాయిన ట్విట్టర్ యూజర్లను చూపిస్తుందట. ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్ సెర్చ్ బార్ లో థ్రెడ్స్ గురించి టైప్ చేసినా రాకపోవడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే ఈ విషయమై ట్విట్టర్ టీమ్ రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది.
URL: ని ఉపయోగించి కూడా థ్రెడ్స్ లింక్స్ తెలుసుకునేలా చేసారట. కానీ ఇక్కడ URL:Threads.net కి బదులు URL:Threads net ఇవ్వాలి. అంటే థ్రెడ్స్, నెట్ కి మధ్యలో డాట్ కాకుండా స్పేస్ ఇవ్వాలని అంటున్నారు.
ఇప్పుడే కాదు గతంలో సబ్ స్టాక్ క్రియేట్ చేసిన నోట్స్ లింక్స్ కూడా ఇలాగే కనపడలేదు.