LOADING...
GST Council : నేటి నుండి జీఎస్‌టీ మండలి సమావేశం..పన్ను రేట్లలో పెద్ద మార్పులు
నేటి నుండి జీఎస్‌టీ మండలి సమావేశం..పన్ను రేట్లలో పెద్ద మార్పులు

GST Council : నేటి నుండి జీఎస్‌టీ మండలి సమావేశం..పన్ను రేట్లలో పెద్ద మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

జీఎస్‌టీ పన్ను శ్లాబ్‌లలో సవరణలు చేపట్టే ఉద్దేశ్యంతో రెండు రోజులపాటు జరగనున్న మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో బిస్కట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి అవసరమైన ఉత్పత్తులపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 5, 12, 18, 28 శాతం జీఎస్‌టీ రేట్ల స్థానంలో కేవలం రెండు శ్లాబ్‌లు.. 5%, 18% మాత్రమే ఉంచాలన్న ప్రతిపాదన ఉంది.

వివరాలు 

 12% జీఎస్‌టీ కింద ఉన్న వస్తువులు 5% వర్గంలో..

అయితే కొన్ని హానికర ఉత్పత్తులపై మాత్రం 40% వరకు పన్ను విధించే అవకాశం ఉంది. రేట్లు తగ్గితే వినియోగం గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం పన్ను రాయితీల కారణంగా కలిగే ఆదాయ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ప్రతిపాదన అమలులోకి వస్తే ప్రస్తుతం 12% జీఎస్‌టీ కింద ఉన్న వస్తువులు 5% వర్గంలోకి వస్తాయి. ఇక 28% కింద వర్గీకరించబడ్డ ఉత్పత్తుల్లో 90% వరకు 18% శ్లాబ్‌కు బదిలీ చేయబడతాయి.

వివరాలు 

వినియోగదారులకు రాబోయే లాభాలు 

బ్రిటానియా స్పందన: ప్రతిపాదిత జీఎస్‌టీ సంస్కరణల ప్రకారం ఆహార ఉత్పత్తులపై పన్నులు తగ్గితే రాబోయే త్రైమాసికాల్లో డిమాండ్‌ పెరుగుతుందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ మేనేజింగ్ డైరెక్టర్‌, సీఈఓ వరుణ్ బెర్రీ తెలిపారు. పన్ను రాయితీల ద్వారా వచ్చిన లాభాలను నేరుగా వినియోగదారులకు చేరుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆహార వస్తువులను 5% శ్లాబ్‌లోకి తీసుకొస్తే వినియోగం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.

వివరాలు 

వినియోగదారులకు రాబోయే లాభాలు 

విప్రో అభిప్రాయం: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వినియోగదారుల డిమాండ్ మరింత మెరుగుపడే అవకాశముందని విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్‌ ప్రొడక్ట్స్‌ సీఈఓ వినీత్ అగర్వాల్ అన్నారు. ప్రతిపాదిత రేట్ల మార్పులు వినియోగాన్ని పెంచుతాయని, వాటి ప్రయోజనాలు ప్రజలకు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దుస్తుల పరిశ్రమ అభ్యంతరం: రూ.2,500 కంటే అధిక ధర కలిగిన దుస్తులపై 18% జీఎస్‌టీ విధించాలన్న ప్రభుత్వ ఆలోచనతో పరిశ్రమలు, ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని క్లోతింగ్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా (సీఎంఏఐ) స్పష్టం చేసింది.