LOADING...
Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో లిస్ట్ కానున్న రెండు కొత్త కంపెనీలు.. వివరాలు ఇవే!
ఈ వారం మార్కెట్లో లిస్ట్ కానున్న రెండు కొత్త కంపెనీలు.. వివరాలు ఇవే!

Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో లిస్ట్ కానున్న రెండు కొత్త కంపెనీలు.. వివరాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 16, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

గత నాలుగు వారాలుగా మెయిన్‌ బోర్డ్‌ నుంచి ఒక్క కంపెనీ కూడా పబ్లిక్‌ ఇష్యూకి రాలేదు. ఈ గడచిన సమయంలో కేవలం ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లోనే పలు సంస్థలు ఐపీఓకు వచ్చాయి. అయితే వచ్చే వారంలో మెయిన్‌ బోర్డ్‌ నుంచి అరిసిన్‌ఫ్రా సొల్యూషన్‌ లిమిటెడ్‌ ఐపీఓకి రానుంది. మొత్తం మూడు సంస్థల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభించుకోనున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి చేసుకున్న రెండు కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి.

Details

అరిసిన్‌ఫ్రా సొల్యూషన్‌ లిమిటెడ్‌ ఐపీఓ 

మెయిన్‌ బోర్డ్‌ నుంచి ఐపీఓకు వస్తున్న అరిసిన్‌ఫ్రా సొల్యూషన్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 20న ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ మొత్తం తాజా షేర్ల జారీ ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 2.86 కోట్ల తాజా షేర్లు జారీ చేయనున్నారు. అయితే ధరల శ్రేణిని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ మార్చి 25న ముగుస్తుంది. ఈ ఇష్యూకి జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, నువామా వెల్త్‌ మేనేజర్‌లు బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు.

Details

డివైజ్‌ హీరా జ్యువెలర్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ 

ఆభరణాల రిటైల్‌ వ్యాపార సంస్థ డివైజ్‌ హీరా జ్యువెలర్స్‌ లిమిటెడ్‌ తన వ్యాపార విస్తరణ కోసం ఐపీఓ ద్వారా నిధులు సమీకరించనుంది. ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.31.84 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సబ్‌స్క్రిప్షన్‌ మార్చి 17న ప్రారంభమై, 19న ముగుస్తుంది. ఇష్యూ ధర రూ.90గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో భాగంగా 35.38 లక్షల తాజా షేర్లు జారీ చేయనుంది. మార్చి 24న డలాల్‌ స్ట్రీట్‌లో లిస్ట్ కానుంది. సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ కోసం వినియోగించనుంది.

Details

పరదీప్ పరివాహన్ లిమిటెడ్‌ ఐపీఓ 

లాజిస్టిక్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగంలో సేవలందిస్తున్న పరదీప్‌ పరివాహన్‌ లిమిటెడ్‌ కూడా తన ఐపీఓకు సిద్ధమైంది. ఈ సంస్థ మార్చి 17 నుంచి 19 వరకు సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉంచనుంది. స్టాక్‌ మార్కెట్‌ ద్వారా మొత్తం రూ.44.86 కోట్ల నిధులను సమీకరించనుంది. ఇందులో భాగంగా 45.78 లక్షల తాజా షేర్లు జారీ చేయనుంది. ఈ ఇష్యూకి ధర శ్రేణిని రూ.93-98గా నిర్ణయించారు. మార్చి 24న ఈ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్ కానున్నాయి.

Details

లిస్టింగ్‌కు సిద్ధమైన కంపెనీలు 

పీడీపీ షిప్పింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ షేర్లు మార్చి 18న స్టాక్‌ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. సూపర్‌ ఐరన్‌ ఫౌండ్రీ షేర్లు మార్చి 19న లిస్టింగ్‌ కానున్నాయి. ఈ ఐపీఓల ద్వారా కంపెనీలు నిధులు సమీకరించి వ్యాపార విస్తరణకు ఉపయోగించుకోనున్నాయి.