
New Scheme: రేపే ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ఒక్కొక్కరికి రూ.15వేలు..
ఈ వార్తాకథనం ఏంటి
కూటమి ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలను కొనసాగిస్తూ, ప్రభుత్వం తాజాగా మరో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనుంది. ఈ కొత్త పథకం "ఆటో డ్రైవర్ సేవలో" (వాహనమిత్ర)గా పిలవబడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆటో,క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏడాదికి ₹15,000 ఆర్థిక సహాయం అందించనుంది. మొత్తం 2.90 లక్షల అర్హులైన డ్రైవర్లకు సుమారు ₹436 కోట్లు ప్రభుత్వం ఈ పథకం కోసం కేటాయిస్తోంది. ఇది సొంత ఆటో లేదా క్యాబ్ కలిగిన డ్రైవర్లకు మాత్రమే వర్తిస్తుంది. రేపు విజయవాడలో ఈ స్కీమ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
వివరాలు
అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు "ఆటో డ్రైవర్ సేవలో" పథకం
ముఖ్యమంత్రి ఇప్పటికే పథకం ప్రారంభ తేదీని, సమయాన్ని ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు నేరుగా ఆర్థిక సహాయం అందించటం జరుగుతుంది. పేద డ్రైవర్ల పెండింగ్ చలాన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల సమస్యలను పరిష్కరించినవారికి ఈ సహాయం వర్తించనుంది. ఆటో, క్యాబ్ (మ్యాక్సీ, మోటార్) డ్రైవర్లకే ఈ పథకం ప్రయోజనాలు అందుతాయని సీఎంను స్పష్టం చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాదికి ₹10,000 మాత్రమే అందించబడేది, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని ₹15,000కి పెంచినట్లు తెలిపారు.
వివరాలు
ఆగస్టు 15న "స్త్రీ శక్తి" పథకం ప్రారంభం
ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించే "స్త్రీ శక్తి" పథకాన్ని సీఎం చంద్రబాబు ఆగస్టు 15న ప్రారంభించారు. అయితే,ఈ పథకం వల్ల తమకు నష్టం వస్తోందని ఆటో,క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సమస్యను స్వీకరించి సీఎం చంద్రబాబు అనంతపురంలోని సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ప్రతి ఏడాది ₹15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు ₹400 కోట్ల భారం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ప్రతి ఏడాది ₹15,000
ఏవైనా కారణాల వల్ల లబ్ధిదారుల జాబితాలో ఒకరి పేరు లేకపోతే, ఆ సమస్యను పరిష్కరించి వారిని జాబితాలో చేర్చిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం "వాహనమిత్ర" పథకం ద్వారా అర్హమైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతీ సంవత్సరం ఆర్థిక సహాయం అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని "ఆటో డ్రైవర్ సేవలో"గా మార్చి, ప్రతి ఏడాది ₹15,000 నేరుగా అందించేందుకు నిర్ణయించింది.