
Unemployment rate: 2024లో స్వల్పంగా 4.9%కి తగ్గిన నిరుద్యోగం రేటు.. ప్రభుత్వ సర్వే
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో నిరుద్యోగిత స్థాయిపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) తాజా గణాంకాలను వెల్లడించింది.
15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తులలో, నిరుద్యోగ రేటు గత సంవత్సరం నమోదైన 5 శాతం నుండి 2024 క్యాలెండర్ సంవత్సరంలో 4.9 శాతానికి తగ్గినట్లు సర్వే తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే, అక్కడ నిరుద్యోగిత కొద్దిగా తగ్గి 4.3 శాతం నుండి 4.2 శాతానికి పడిపోయింది.
ఈ వివరాలను బుధవారం నాడు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
వివరాలు
పట్టణాలలో మొత్తం నిరుద్యోగ రేటు 6.7 శాతం
పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది.పురుషుల నిరుద్యోగ రేటు 6 శాతం నుండి 6.1 శాతానికి పెరగగా,స్త్రీలలో నిరుద్యోగిత 8.9 శాతం నుండి 8.2 శాతానికి తగ్గింది.
ఈ మార్పుల ఫలితంగా పట్టణాలలో మొత్తం నిరుద్యోగ రేటు 6.7 శాతంగా స్థిరంగా ఉంది.
దేశవ్యాప్తంగా చూసినపుడు,జీతం చెల్లించని కుటుంబ సహాయకుల సంఖ్యలో తగ్గుదల ఉండటంతో, గ్రామీణ మహిళల కార్మిక జనాభా నిష్పత్తి (WPR),శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR)లో కొంత మేర తగ్గుదల కనిపిస్తోంది.
అన్ని వర్గాల్లోను, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, డబ్ల్యూపీఆర్ స్వల్పంగా మెరుగై 47 శాతం నుండి 47.6 శాతానికి చేరింది.
దేశవ్యాప్తంగా మొత్తం డబ్ల్యూపీఆర్ 53.4 శాతం నుండి 53.5 శాతానికి తేలికపాటి పెరుగుదల చూపించింది.
వివరాలు
పట్టణ ప్రాంతాల్లో సగటు LFPR 50.3 శాతం నుండి 51 శాతానికి..
పట్టణ ప్రాంతాల్లో పురుషుల ఎల్ఎఫ్‌పీఆర్ 2023లో 74.3 శాతం నుండి 2024లో 75.6 శాతానికి పెరిగింది.
స్త్రీల LFPR 25.5 శాతం నుండి 25.8 శాతానికి స్వల్పంగా పెరిగింది.
మొత్తంగా పట్టణ ప్రాంతాల్లో సగటు LFPR 50.3 శాతం నుండి 51 శాతానికి చేరుకుంది.
అంతిమంగా, దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు 3.1 శాతం నుండి 3.2 శాతానికి కొద్దిగా పెరిగినట్లు పీఎల్ఎఫ్ఎస్ వివరించింది.