Page Loader
Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో "అతిపెద్ద","అతిచిన్న" బడ్జెట్ ప్రసంగాల వరకు.. పూర్తి జాబితాను ఇక్కడ తనిఖీ చేయండి
భారత బడ్జెట్ చరిత్రలో "అతిపెద్ద","అతిచిన్న" బడ్జెట్ ప్రసంగాల వరకు.. పూర్తి జాబితాను ఇక్కడ తనిఖీ చేయండి

Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో "అతిపెద్ద","అతిచిన్న" బడ్జెట్ ప్రసంగాల వరకు.. పూర్తి జాబితాను ఇక్కడ తనిఖీ చేయండి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలంతా అనేక ఆశలు పెట్టుకున్నారు. ఇండియాను ఆర్థికంగా మరింత ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లే అనేక నిర్ణయాలు ఉండబోతాయని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిర్మలమ్మ చేయబోయే బడ్జెట్ ప్రసంగం గురించి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం ఆమె వరసగా 8వసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. భారత బడ్జెట్ చరిత్రలో అతిపెద్ద, అతి చిన్న బడ్జెట్ ప్రసంగాలు ఏంటో , ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

అతిపెద్ద బడ్జెట్ ప్రసంగాలు: 

నిర్మల సీతారామన్: 2020 బడ్జెట్ ప్రదర్శన సమయంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత చరిత్రలో అతి సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2020-21 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగింది. 2019 బడ్జెట్‌లో ఆమె చేసిన 2 గంటల 19 నిమిషాల ప్రసంగంతో పోలిస్తే, 2020లో ఆమె తన సొంత రికార్డును అధిగమించారు. జస్వంత్ సింగ్: నిర్మలా సీతారామన్ ముందు అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు జస్వంత్ సింగ్ పేరిట ఉన్నది. ఆయన 2023లో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. 2014లో అరుణ్ జైట్లీ 2 గంటల 10 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.

వివరాలు 

అతి చిన్న బడ్జెట్ ప్రసంగాలు: 

హిరుభాయ్ ఎం. పటేల్: భారతదేశ బడ్జెట్ చరిత్రలో అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం. పటేల్ చేసిన ప్రసంగం నిలిచిపోతుంది. ఆయన ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతో తయారైంది. పదాల పరంగా చూస్తే: 1991లో అప్పటి ఆర్థిక మంత్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌దే. ఈ బడ్జెట్ ప్రసంగంలో 18,600 పదాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రపంచీకరణ వైపు తీసుకెళ్లింది. పీవీ నరసింహరావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ 1991-96 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.