Union Budget 2025: మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. 2025-26 కేంద్ర బడ్జెట్ - ముఖ్యాంశాలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా మధ్య తరగతి ఉద్యోగులకు భారీ ఊరట కల్పించారు.
ఆదాయ పన్ను మినహాయింపును రూ.12 లక్షల వరకు పెంచారు.
సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపును రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు.
అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు సమయాన్ని 4 ఏళ్లకు పొడిగించారు.
వీటితో పాటు పలు రంగాలకు సంబంధించిన కీలక చర్యలు ప్రకటించారు.
వివరాలు
రైతులకు ప్రోత్సాహక పథకాలు
KCC (కిషాన్ క్రెడిట్ కార్డ్) ద్వారా రైతులకు ఇచ్చే లోన్ల పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు.
ఇది రైతులకు మరింత ఆర్థిక సహాయం అందించేందుకు తోడ్పడుతుంది.
గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక ఆర్థిక & ఆరోగ్య పరిరక్షణ
గిగ్ వర్కర్లకు (ఫ్రీలాన్సర్లు) ఆరోగ్య బీమా సదుపాయం, గుర్తింపు కార్డులు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా నమోదు అవకాశం కల్పించనున్నారు.
పీఎం జన్ ఆరోగ్య యోజన కింద 1 కోటి గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా అందించనున్నారు.
వివరాలు
విద్య రంగంలో సంస్కరణలు
IIT పాట్నా విస్తరణ కు అనుమతి .
5 ఏళ్లలో 75,000 కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
50,000 ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు.
22 ప్రధాన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.
ఉడాన్ పథకం & రవాణా అభివృద్ధి
ఉడాన్ పథకాన్ని మరింత విస్తరించి 120 కొత్త రూట్లు ప్రవేశపెట్టనున్నారు.
EV బ్యాటరీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ప్రకటించారు.
క్లీన్‌టెక్ మిషన్ ద్వారా పర్యావరణ అనుకూల నూతన పరిజ్ఞానాన్ని ప్రోత్సహించనున్నారు.
వివరాలు
మరింత ప్రోత్సాహకాలు & వడ్డీ రహిత రుణాలు
రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయనున్నారు.
మూలధన వ్యయాల కోసం 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందించనున్నారు.
వివిధ రంగాల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహక పథకాలు అమలు చేయనున్నారు.
పేదరిక నిర్మూలన లక్ష్యం "వికాస్ భారత్" లక్ష్యంతో, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కార్యాచరణ రూపొందించారు.
డిజిటల్ శిక్షణ
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.