Page Loader
Union Budget 2025: ఏది చౌకగా,ఏది ఖరీదైనది? ఈ జాబితా మీ కోసమే! 
ఏది చౌకగా,ఏది ఖరీదైనది? ఈ జాబితా మీ కోసమే!

Union Budget 2025: ఏది చౌకగా,ఏది ఖరీదైనది? ఈ జాబితా మీ కోసమే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2025
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ చట్టంలో కీలక మార్పులను చేసింది. అలాగే, ఏడు రకాల సుంకాలను తగ్గించింది. ఇందులో భాగంగా 36 రకాల ఔషధాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా తొలగించింది. దీని వలన క్యాన్సర్‌ మందులు, శస్త్రచికిత్సా పరికరాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. లిథియం బ్యాటరీలపైనా పన్నును రద్దు చేయడం వల్ల టీవీలు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించనుంది.

వివరాలు 

బడ్జెట్‌ తర్వాత ధరలు తగ్గే వస్తువులు: 

1. క్యాన్సర్‌ మందులు: క్యాన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన 36 రకాల ఔషధాలపై కస్టమ్స్‌ డ్యూటీని తొలగించడం వల్ల, వాటి ధరలు తగ్గనున్నాయి. మెడికల్‌ పరికరాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. 2. టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు: బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 5 శాతానికి తగ్గించడంతో టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. 3. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు: లిథియం బ్యాటరీలపై పన్నును తొలగించడం వల్ల మొబైల్‌ ఫోన్ల బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గనున్నాయి. 4. లెదర్‌ ఉత్పత్తులు: జాకెట్లు, షూస్‌, బెల్ట్లు, పర్స్‌ వంటి లెదర్‌ ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడం వల్ల, వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది.

వివరాలు 

బడ్జెట్‌ తర్వాత ధరలు తగ్గే వస్తువులు: 

5. ఖనిజాలు: కోబాల్ట్‌ పౌడర్‌, సీసం, జింక్‌ సహా మరో 12 ఖనిజాలను బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించారు. 6. నౌకా నిర్మాణ సామగ్రి: నౌకల తయారీకి అవసరమైన ముడిసరుకులపై కూడా బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని మినహాయించారు. 7. సముద్ర ఉత్పత్తులు: రొయ్యలు, చేపల దాణా, ఫ్రోజెన్‌ చేపలపై కూడా పన్నును తగ్గించారు. ధరలు పెరిగే వస్తువులు: ప్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే సోషల్‌ వెల్ఫేర్‌ సర్‌ఛార్జి