
Aadhar: ఆధార్‌లో సవరణ ఇక నిమిషాల్లో! ఈ యాప్‌తో నిమిషాల్లో చేయెుచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ కాలంలో ఆధార్ కార్డు లేకుండా ప్రాధాన్యత కలిగిన పనులు చేయడం అసాధ్యమే. అది ఓ గుర్తింపు ఆధారంగా కాకుండా,అవసరమైన ధృవీకరణ పత్రంగా మారిపోయింది. అయితే చాలా మందికి తమ ఆధార్ కార్డుల్లోని వివరాలు తప్పుగా ఉన్నాయి.దాంతో, అవి సరిచేయాలంటే ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మీరు కూడా ఆధార్ కార్డులో పేరు,చిరునామా, లేదా పుట్టిన తేదీలో ఏదైనా తప్పు ఉందని గుర్తిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే అప్డేట్ చేసుకోవాలి. లేదంటే బ్యాంకింగ్,ప్రభుత్వ సేవలు వంటి అనేక అవసరాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
వివరాలు
ఈ సవరణల్ని చేయడం మరింత సులభం
ఇప్పుడు ఈ సవరణల్ని చేయడం మరింత సులభమైంది. 'ఎంఆధార్' (mAadhaar) యాప్ ద్వారా ఇంట్లో కూర్చొనే ఈ పనిని పూర్తిచేయొచ్చు. ఈ యాప్ ఉపయోగించి, మీరు మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ లాంటి కీలక వివరాలను కొద్ది నిమిషాల్లోనే సరిచేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో Google Play Store లేదా Apple App Store నుండి ఎంఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత 'Register My Aadhaar' అనే ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ మీ ఆధార్ నంబర్,మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే, మీ ఫోన్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని ఇచ్చిన స్థలంలో నమోదు చేస్తే, మీరు యాప్‌లోకి లాగిన్ అవుతారు.
వివరాలు
వివరాలు మార్చేందుకు సరైన డాక్యుమెంట్లు సమర్పించాలి
యాప్‌లో లాగిన్ అయిన తర్వాత, మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలతో పాటు పేరు కనిపిస్తుంది. ఆ తరువాత 'My Aadhaar' అనే విభాగాన్ని ఎంచుకోవాలి. అక్కడ 'Aadhaar Update' అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని టాప్ చేస్తే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Request OTP'అనే బటన్‌ను క్లిక్ చేయాలి. ఓటీపీ ఇచ్చిన తర్వాత,డేటా మార్చుకునే విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ పేరు,చిరునామా,పుట్టిన తేదీ వంటి వివరాలను సరిచేసుకుని సబ్మిట్ చేయవచ్చు. అయితే,ఈ వివరాలు మార్చేందుకు మీరు సరైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఉదాహరణకు,చిరునామా మార్పుకు కరెంట్ బిల్,పుట్టిన తేదీ మార్పుకు బర్త్ సర్టిఫికేట్ వంటి పత్రాలు అవసరం. ప్రతి మార్పు కోసం రూ.50 ఫీజుగా వసూలు చేస్తారు.