LOADING...
UPI Down: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ..
దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ..

UPI Down: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2025
08:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ(UPI) సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా ఈ సేవలు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. చెల్లింపులు, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి లావాదేవీల్లో సమస్యలు ఎదురవుతున్నాయని యూజర్లు తెలిపారు. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం సాయంత్రం 7 గంటల తరువాత ఈ సమస్య ఉత్పన్నమైందని తెలుస్తోంది. దీనిపై యూజర్లు సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. యూపీఐ సేవలను అందించే గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్‌లు పనిచేయడం లేదని వారు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) లేదా బ్యాంకులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూపీఐ సేవల్లో అంతరాయం ..