యూపీఐ పేమెంట్స్ మరింత సులువు.. వాయిస్ మెసేజ్‌తో చెల్లింపులు!
యూపీఐ వినియోగదారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా కొత్త సర్వీసులను అందుబాటులో తెచ్చింది. వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు సులభంగా చేయొచ్చు. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా కొత్త సర్వీసులను ఆవిష్కరించారు. ఎన్‌పీపీఐ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఈ సేవలను తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో డబ్బు ఎవరికైనా చెల్లించాలంటే గతంలో అన్ని వివరాలను సమర్పించాల్సి ఉండేంది. ప్రస్తుతం వాయిస్ యాక్సెస్, మిస్డ్ కాల్ ద్వారా ఈ డిజిటల్ పేమెంట్స్ మరింత సులభం కానున్నాయి. 'హాలో యూపీఐ' విధానంతో యాప్స్, టెలికాం కాల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల ద్వారా వాయిస్ ఆధారిత యూపీఐ చెల్లింపులు చేసే వెసులుబాటు కలగనుంది.
ఆఫ్ లైన్ లో కూడా డబ్బును పంపొచ్చు
ప్రస్తుతం ఈ సేవలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోనూ వీటిని ప్రారంభిస్తున్నట్లు NPCI పేర్కొంది. మరోవైపు LITE X ద్వారా ఆఫ్ లైన్‌లోనూ డబ్బును పంపే సదుపాయం కూడా ఉంది. UPI, UPI లైట్ X, ట్యాప్ అండ్ పే, సంభాషణ ద్వారా చెల్లింపుల కోసం హలో! UPI, బిల్‌పే కనెక్ట్.. పేరుతో మొత్తం ఐదు పేమెంట్ విధానాలను తీసుకొచ్చారు. బిల్ పే కనెక్ట్ పేరుతో యాప్‌లో కేవలం 'హాయ్' అని సందేశం పంపడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్, మొబైల్ డేటా యాక్సెస్ లేని సందర్భాల్లో కేవలం మిస్ట్ కాల్ ద్వారా బిల్ పేమెంట్ చేసే సౌకర్యం ఉండనుంది.