తదుపరి వార్తా కథనం

UPI: దేశవ్యాప్తంగా యూపీఐ సర్వర్ డౌన్.. వినియోగదారులు ఇబ్బందులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 12, 2025
12:55 pm
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ పేమెంట్స్ వల్ల చెల్లింపుల ప్రక్రియ సులభతరం అయిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న వారందరూ యూపీఐ సేవలను ఉపయోగిస్తున్నారు.
కానీ అప్పుడప్పుడు యూపీఐ సర్వర్ డౌన్ అవడం వల్ల యూజర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా శనివారం మధ్యాహ్నం ఢిల్లీతో పాటు దేశం అంతటా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపీఐ) సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి.
దాంతో చాలా మంది యూపీఐ ద్వారా పేమెంట్లు చేయలేకపోయారు. Paytm, PhonePe, G Pay వినియోగదారులు తమ చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడ్డారు.
పేమెంట్లు ఫెయిల్ కావడంతో, యూజర్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.