
Apple: ఆపిల్‌పై అమెరికా ప్రభుత్వం దావా.. ఒక్క రోజులో రూ.9.41 లక్షల కోట్లు నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ పై అమెరికా ప్రభుత్వం దావా వేసింది.ఐఫోన్ డివైజ్‌ల ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కంపెనీ గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.
దీంతో యాపిల్ షేర్లు 4.1 శాతం నష్టాల్లోకి వెళ్లిపోయాయి.కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 113 బిలియన్ డాలర్లు(రూ.9.41 లక్షల కోట్లు)తగ్గిపోయింది.
మొత్తంగా కంపెనీ షేరు విలువ ఈ ఏడాది 11శాతం వరకు తగ్గడం గమనార్హం.మరోవైపు ప్రభుత్వ ఆరోపణలను యాపిల్ కొట్టిపారేసింది.
అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని,ఇలాంటి చర్యలతో ప్రభుత్వం ప్రమాదకర సంప్రదాయాన్ని నెలకొల్పుతోందంటూ ఆరోపించింది.
ప్రజల కోసం రూపొందిస్తున్నటెక్నాలజీ అభివృద్ధి ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని పేర్కొంది. ఇలాంటి దావాలు యాపిల్ ఉత్పత్తులు మార్కెట్‌లో నెలకొల్పిన ప్రమాణాలకు ముప్పు తలపెడతాయని అభిప్రాయపడింది. వీటిని సమర్థంగా ఎదుర్కొంటామని వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆపిల్ ఏకపక్ష విధానాలతో గుత్తాధిపత్యం సాధించి పోటీ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని దావా
Apple Loses $113 Billion In Market Value As Regulators Close In https://t.co/NYX7WERiEu pic.twitter.com/sCBWq90hpb
— NDTV (@ndtv) March 22, 2024