తదుపరి వార్తా కథనం

E20 petrol: ఇ20 పెట్రోల్ వాడకంతో వాహనాల మైలేజ్ 2-5 శాతం తగ్గే అవకాశం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 25, 2025
09:19 am
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (బ్లెండెడ్ పెట్రోల్) వాడకంతో వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వాహన పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్ల వేరియంట్లను బట్టి ఈ ప్రభావం కొద్దిగా తేడా చూపవచ్చని వారు పేర్కొన్నారు. ఇ20 పెట్రోల్ వాడకంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ రంగంలోని ప్రముఖ కంపెనీల ఇంజినీర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Details
ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం
వారి ప్రకారం ఇ20కి అనుకూలం కాని పాత వాహనాల్లో దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులు నెమ్మదిగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. అయితే తక్షణ ప్రభావం మాత్రం ఉండదని స్పష్టంచేశారు.