40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), HDFC బ్యాంక్‌లతో సహా రూ. 30,000-40,000 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రధాన బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఇండస్ టవర్స్ వంటి టవర్ కంపెనీలకు, ఎరిక్సన్, నోకియా వంటి నెట్‌వర్క్ పరికరాల తయారీదారులకు బకాయిలు చెల్లించాల్సిన వోడాఫోన్ ఐడియాకు రుణాన్ని రీఫైనాన్సింగ్ చేస్తే చెల్లింపులకు సహాయపడుతుందని పేర్కొంది. వొడాఫోన్ ఐడియా రూ.2 లక్షల కోట్ల అప్పులతో సతమతమవుతోంది. ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో రూ.16.133కోట్లకు పైగా వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చడానికి ఆమోదించింది. దీనితో ప్రభుత్వం 33.14 శాతం వాటాతో నష్టాల్లో ఉన్న టెలికాం సంస్థలో ఏకైక అతిపెద్ద వాటాదారుగా అవతరించింది.
టెలికాం కంపెనీలు లైసెన్స్ ఫీజులు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వాటా రూపంలో చెల్లించాలి
సెప్టెంబర్ 2021లో ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణల ప్యాకేజీలో భాగంగా కంపెనీకి ఉపశమనం లభిస్తుంది. ఈక్విటీ షేర్లుగా మార్చాల్సిన మొత్తం రూ. 16133,18,48,990. రూ. 10 ముఖ విలువ కలిగిన 1613,31,84,899 ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి రూ. 10 ఇష్యూ ధరతో జారీ చేయాలని కంపెనీకి ఆదేశాలు అందాయని ఫైలింగ్ లో ఉంది. టెలికాం కంపెనీలు లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు (SUC) కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వాటా రూపంలో చెల్లించాలి. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం లేదా AGR ప్రభుత్వానికి చెల్లించాలసిన లెక్కగట్టిన లైసెన్స్ ఫీజులు, SUC మొత్తం.