భారతదేశంలో మోటోరోలాతో 5G భాగస్వామ్యాన్ని ప్రకటించిన వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా (Vi) భారతదేశంలోని OEM స్మార్ట్‌ఫోన్ సిరీస్ 5G సాంకేతికతను తీసుకురావడానికి మోటోరోలా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వోడాఫోన్ ఐడియా ఇంకా తన 5G నెట్‌వర్క్ ప్లాన్‌లను ప్రకటించలేదు. అయితే మోటోరోలా నుండి తాజా 5G ఫోన్లు వోడాఫోన్ ఐడియా 5G స్పెక్ట్రమ్ తో పరీక్షించారు. భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌పై వేలం వేసిన టెలికాం కంపెనీలలో వోడాఫోన్ ఐడియా (Vi) ఒకటి, ఇందులో దాదాపు రూ. 18,799 కోట్లు పెట్టింది. అయితే భారతదేశంలోని ఏ ప్రాంతాల్లోనూ 5Gని విడుదల ఇంకా చేయలేదు. మోటోరోలాతో వోడాఫోన్ ఐడియా భాగస్వామ్యం భారతదేశంలో తన హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ లు 5G కోసం సిద్ధంగా ఉంచాలని ప్రయత్నం చేస్తుంది.
ఈ టెలికాం జాయింట్ వెంచర్‌లో ప్రభుత్వం 33% వాటాను కొనుగోలు చేసింది
తన 5G స్మార్ట్‌ఫోన్‌లలో 5G కనెక్టివిటీని అందించే లక్ష్యంతో, మోటోరోలా వోడాఫోన్ ఐడియా 5G నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌లలో 3350MHz నుండి 3400MHz వరకు స్మార్ట్‌ఫోన్ మోడల్‌లను పరీక్షించింది. ఎడ్జ్ 30 Ultra, ఎడ్జ్ 30 Fusion, ఎడ్జ్ 30 Pro, స్టాండర్డ్ Edge 30, G62 5G, G82 5G, G71 5G, G51 5G, Edge 20, Edge 20 Pro, and Edge 20 Fusion వంటి ఫోన్లలో పరీక్షించారు. UK వోడాఫోన్, కుమార్ మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ మధ్య ఏర్పడిన టెలికాం జాయింట్ వెంచర్‌లో ప్రభుత్వం 33% వాటాను కొనుగోలు చేసింది. ఇప్పటికే ఎయిర్ టెల్ , జియో తమ 5G సేవలు మొదలుపెట్టాయి.