Page Loader
Waaree Energies IPO: సోలార్‌ ప్యానెల్‌ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్‌ ఐపీఓ.. అక్టోబర్‌ 21న ప్రారంభం 
సోలార్‌ ప్యానెల్‌ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్‌ ఐపీఓ..అక్టోబర్‌ 21నప్రారంభం

Waaree Energies IPO: సోలార్‌ ప్యానెల్‌ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్‌ ఐపీఓ.. అక్టోబర్‌ 21న ప్రారంభం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోలార్‌ ప్యానెల్‌ తయారీ సంస్థ వారీ ఎనర్జీస్‌ (Waaree Energies IPO) మార్కెట్‌ ద్వారా రూ.4,321 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూ తీసుకురానుంది. అక్టోబర్‌ 21న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై, 23న ముగుస్తుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు అక్టోబర్‌ 18న బిడ్డింగ్‌ విండో అందుబాటులో ఉంటుంది. ఐపీఓ ధర శ్రేణి రూ.1,427 నుండి రూ.1,503గా నిర్ణయించబడింది. 9 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు, అంటే ఒక్క లాట్‌ కొనుగోలుకు రూ.13,527 ఖర్చు చేయాలి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 14 లాట్లను కొనుగోలు చేయవచ్చు.

వివరాలు 

ఆఫర్‌ పర్‌ సేల్‌ ద్వారా వాటాల విక్రయం 

ఈ ఐపీఓలో భాగంగా రూ.3,600 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లను జారీ చేయనున్నారు. అలాగే, రూ.721.44 కోట్ల విలువైన 48 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS)ద్వారా విక్రయించనున్నారు. ప్రమోటర్‌గా ఉన్న వారీ సస్టైన్‌బుల్‌ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, షేరు హోల్డర్‌గా ఉన్న చందూకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఆఫర్‌ పర్‌ సేల్‌ ద్వారా వాటాలను విక్రయిస్తాయి. ఉద్యోగుల కోసం రూ.65 కోట్ల విలువైన షేర్లను కంపెనీ రిజర్వ్‌ చేసింది.క్యూఐబీలకు 50%,రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35%, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు 15%చొప్పున రిజర్వ్‌ చేశారు. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను ఒడిశాలో 6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ సెల్‌, సోలార్‌ పీవీ మాడ్యూల్‌ తయారీ కేంద్రం నెలకొల్పేందుకు ఉపయోగించనున్నారు.

వివరాలు 

ఐదు తయారీ యూనిట్లు

కొంత మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తారు. సోలార్‌ ఎనర్జీ ఇండస్ట్రీలో ప్రముఖ ఆటగాడిగా ఉన్న వారీ ఎనర్జీస్‌.. 2023 జూన్‌ 30 నాటికి 12 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పీవీ మాడ్యూల్స్‌ను తయారు చేస్తోంది. సూరత్‌, టుంబ్‌ (వల్సాడ్‌), నందిగ్రామ్‌, చిఖ్లీ (బుల్దానా), నొయిడాలో ఐదు తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ ఐపీఓకు యాక్సిస్‌ క్యాపిటల్, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, జెఫ్రీస్‌ ఇండియా, నొమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఇంటెన్సివ్‌ ఫిస్కల్‌ సర్వీసెస్‌, ఐటీఐ క్యాపిటల్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా పనిచేస్తున్నాయి.