Page Loader
అమెజాన్ ఉద్యోగులకు సీఈఓ హెచ్చరిక.. ఆఫీసుకు రావాల్సిందే, లేదంటే..
అమెజాన్ ఉద్యోగులకు సీఈఓ హెచ్చరిక.. ఆఫీసుకు రావాల్సిందే, లేదంటే..

అమెజాన్ ఉద్యోగులకు సీఈఓ హెచ్చరిక.. ఆఫీసుకు రావాల్సిందే, లేదంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2023
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంవత్సరం ప్రారంభంలో, దిగ్గజ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాలని చెప్పారు. ఈ నిర్ణయం నిరసనలకు దారితీసింది. కొంతమంది ఉద్యోగులు 'మెయిన్ హబ్' కార్యాలయాలకు వెళ్లకుండా దానికి బదులుగా రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జాస్సీ తమ ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రావాలని లేదా వారి ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించినట్లు ఇప్పుడు ఒక కొత్త నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆండీ జాస్సీ వ్యాఖ్యలను ప్రముఖ వార్తా పత్రికలు ఉటంకించాయి.

Details 

సంస్థ ఆదేశాలను పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు

ఈ నెల మొదట్లో జరిగిన ఒక సమావేశంలో జాస్సీ ఈ ప్రకటన చేశారు. సంస్థ ఆదేశాలను పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆఫీసుకు వస్తేనే ఇతర ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా పనిచేయగలరని ,అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి జరుగుతాయని ఆండీ జాస్సీ చెప్పారు. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌,సోషల్ మీడియా దిగ్గజం మెటా కూడా.. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని ఒకవేళ ఆఫీస్ కి రాకపోతే .. వారిని తొలగించేందుకు కూడా రెడీ అని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.