LOADING...
US Fed rate cut: యుఎస్ అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు.. భారత స్టాక్‌ మార్కెట్‌పై ‍ప్రభావం ఎంత?
యుఎస్ అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు.. భారత స్టాక్‌ మార్కెట్‌పై ‍ప్రభావం ఎంత?

US Fed rate cut: యుఎస్ అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు.. భారత స్టాక్‌ మార్కెట్‌పై ‍ప్రభావం ఎంత?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) బుధవారం కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 3.75% - 4.00% శ్రేణికి తీసుకువచ్చింది. ఇది ఈ ఏడాది ఫెడ్ చేసిన రెండో వరుస వడ్డీ రేటు కోత. అమెరికా ఆర్థిక పరిస్థితులు, కొత్తగా వస్తున్న డేటా, భవిష్యత్ రిస్క్‌లను పరిశీలిస్తూ రాబోయే నెలల్లో వడ్డీ రేట్ల దిశను నిర్ణయిస్తామని ఫెడ్ పేర్కొంది. అయితే, ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తదుపరి మీటింగ్‌లో మరోసారి వడ్డీ రేటు తగ్గించే అవకాశం తక్కువగానే ఉందని స్పష్టం చేశారు. డిసెంబర్ 2025లో మరొక కోత ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తున్నప్పటికీ, "అది అంత సులభం కాదు" అని ఆయన అన్నారు.

వివరాలు 

భారత మార్కెట్‌పై ప్రభావం 

ఫెడ్ రేటు కోత తర్వాత అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌ జోన్స్, ఎస్ & పీ 500 స్వల్పంగా తగ్గగా, టెక్ షేర్ల బలంతో నాస్‌డాక్ పెరిగింది. గురువారం ఆసియా మార్కెట్లు కూడా ఎక్కువగా నెగటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. ఫెడ్ నిర్ణయం భారత మార్కెట్‌పై కూడా ప్రభావం చూపనుంది. గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లు బలంగా నడవడం వల్ల 25 బేసిస్ పాయింట్ల కోతను ఇప్పటికే ఇన్వెస్టర్లు అంచనా వేసి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అమెరికా వడ్డీ రేట్లు తగ్గడం వలన ఎమర్జింగ్ మార్కెట్లలోకి, ముఖ్యంగా భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు (FII inflows) పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

పెద్ద ర్యాలీ వచ్చే అవకాశాలు తక్కువే

మార్కెట్ నిపుణుడు అవినాష్ గోరక్షకర్ మాట్లాడుతూ,"ఫెడ్ రేటు కోత దీర్ఘకాలంలో భారత మార్కెట్‌కు పాజిటివ్. అమెరికా బాండ్ల ఆకర్షణ తగ్గి, కొంత నిధి భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్లకు వస్తుంది" అన్నారు. అయితే ఈ కారణంతో పెద్ద ర్యాలీ వచ్చే అవకాశాలు తక్కువేనని కూడా చెప్పారు. మేహతా ఎక్విటీస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ టప్సే మాట్లాడుతూ.."అమెరికా ట్రెజరీ యీల్డ్స్ తగ్గితే, గ్లోబల్ ఇన్వెస్టర్లకు అప్పు వ్యయం తగ్గుతుంది. దాంతో రిస్క్ ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెరగవచ్చు" అన్నారు.

వివరాలు 

స్వల్పంగా పడిపోయిన US స్టాక్ మార్కెట్లు,బాండ్ ధరలు

ITI గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ సీఐఓ మొహిత్ గులాటి మాట్లాడుతూ,"ఇది గ్లోబల్ మానిటరీ పాలసీలో టర్నింగ్ పాయింట్.భారత్‌లోకి కొత్తగా విదేశీ పెట్టుబడులు రావచ్చు,లిక్విడిటీ పెరుగుతుంది. కానీ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. రేటు కోతలు ఒక్కసారిగా ఆర్థిక వృద్ధిని పెంచవు. ఇది లిక్విడిటీ పెరుగుదల మాత్రమే,ఫండమెంటల్ మార్పు కాదు" అని అన్నారు. అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ జాగ్రత్త ధోరణి పాటించడంతో US స్టాక్ మార్కెట్లు,బాండ్ ధరలు స్వల్పంగా పడిపోయాయి. మార్కెట్లు డిసెంబర్‌లో మరో కోతపై అంచనాలు తగ్గించుకున్నాయి. VT మార్కెట్స్ గ్లోబల్ స్ట్రాటజీ లీడ్ రాస్ మాక్స్‌వెల్ మాట్లాడుతూ,"ఫెడ్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇది స్టాక్ మార్కెట్లలో కొంత వోలాటిలిటీకి దారితీయవచ్చు.అయినా కూడా ఇది గ్రోత్ అసెట్స్‌కు సహాయకంగానే ఉంటుంది"అని పేర్కొన్నారు.

వివరాలు 

టెక్నికల్ అంచనా

నిఫ్టీ 50 సూచీ బుధవారం చిన్న బాడీ క్యాండిల్‌ను రూపొందించింది,ఇది అమ్మకాల ఒత్తిడి స్వల్పంగా ఉందని సూచిస్తోంది. సూచీ ప్రధాన మోవింగ్ అవరేజీలకు పైనే ట్రేడ్ అవుతోంది. SBI సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ సుదీప్ షా ప్రకారం, "నిఫ్టీ 26,100 - 26,150 జోన్‌ను దాటితే మరింత ఎగబాకే అవకాశం ఉంది. అయితే 25,850 - 25,800 జోన్ బలమైన సపోర్ట్‌గా ఉంటుంది" అన్నారు. మొత్తంగా, అమెరికా ఫెడ్ వడ్డీ రేటు కోత తాత్కాలిక ప్రభావమే చూపినా, దీర్ఘకాలంలో భారత మార్కెట్‌కు విదేశీ పెట్టుబడుల రూపంలో లాభం కలిగించే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.