Koo app shuts down: ట్విటర్‌తో పోటీ పడిన కూ ఎందుకు మూతపడింది? లింక్డిన్‌లో అసలు కారణాన్నిపోస్ట్ చేసిన సంస్థ వ్యవస్థాపకులు
భారతీయ నిర్మిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'కూ' నేటి నుండి తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ విషయాన్నికంపెనీ వ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిడవత్కా కంపెనీ మూసివేత గురించి తెలియజేశారు. అప్రమేయ, మయాంక్ మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డిన్‌లో ఈ మేరకు బుధవారం పోస్ట్ చేశారు. డైలీ హంట్ సహా ఇతర కంపెనీలతో అమ్మకానికి చర్చలు జరిపినా అవేవీ సక్సెస్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కూ యాప్‌ను 2019లో అప్రమేయ రాధాకృష్ణ,మయాంకర్ బిడవట్కా కలిసి ప్రారంభించారు. ఈ యాప్ కి రాధాకృష్ణ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రైతు ఉద్యమ సమయంలో అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విటర్‌తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్నప్పుడు కూ యాప్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఒకానొక దశలో 21లక్షల డైలీ యాక్టివ్ యూజర్లు
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులే స్వయంగా ఆత్మనిర్భర్ యాప్‌గా'కూ'ను ప్రమోట్ చేయడంతో తక్కువ సమయంలోనే ఈ యాప్ కి యూజర్ బేస్ గణనీయంగా పెరిగింది. అనంతరం,నైజీరియా,బ్రెజిల్ వంటి దేశాలకూ కూడా ఈ కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించింది. అటు తరువాత ఈ సంస్థకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరింది.ఈ ఏడాది లేఆఫ్‌లూ కూడా ప్రకటించింది. ప్రాంతీయ భాషలతో ఈ దేశీయ యాప్ తయారుచేశామని ఒకానొక దశలో 21లక్షల డైలీ యాక్టివ్ యూజర్లను కూడా ఉండేవారని కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు. తమ నాలుగేళ్ల ప్రయాణంలో 'కూ'యాప్ అనేక ఎత్తుపల్లాలు చూసిందని తెలిపారు.లిటిల్ ఎల్లో బర్డ్ ఇక గుడ్ బై చెప్తోందంటూ వ్యవస్థాపకులు తమ లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.