Loading...
5-Nation Tour: పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!
పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!

5-Nation Tour: పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.3 పెరగడంతో దేశ ప్రజలకు శుక్రవారం ఉదయం భారీ షాక్‌ తగిలింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటనకు బయల్దేరారు. నెదర్లాండ్స్‌, స్వీడన్‌, నార్వే, ఇటలీ దేశాలతో కూడిన ఐదు దేశాల పర్యటనలో భాగంగా అబుదాబిలో కేవలం నాలుగు గంటలే గడపనున్నప్పటికీ.. ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోదీ భేటీ కీలకంగా మారింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగిన ముడి చమురు ధరలు 

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగ దేశమైన భారత్‌కు ప్రస్తుతం చమురు దిగుమతులు అత్యంత కీలకంగా మారాయి.

దేశానికి అవసరమైన చమురులో దాదాపు 90 శాతం, గ్యాస్‌లో 50 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది.

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.

దీంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ఇండియన్ ఆయిల్‌, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలు ధరలను అదుపులో ఉంచేందుకు రోజుకు దాదాపు రూ.1000 కోట్ల వరకు నష్టపోయినట్లు సమాచారం.

వివరాలు 

చరిత్రాత్మక కనిష్టానికి రూపాయి

దిల్లీలో పెట్రోల్ ధర రూ.94.77 నుంచి రూ.97.77కు, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.90.67కు చేరింది.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే ఈ ధరల పెంపు రావడం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.

మరోవైపు రూపాయి విలువ కూడా డాలర్‌తో పోలిస్తే చరిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది.

దీంతో చమురు దిగుమతుల భారం మరింత పెరిగింది. ఇప్పటికే టోకు ద్రవ్యోల్బణం 42 నెలల గరిష్టానికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య మే 11న దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ఇంధన పొదుపుపై దృష్టి పెట్టాలని సూచించారు.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని, అవసరమైతే వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహించాలని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

యూఏఈతో చమురు సరఫరా ఒప్పందాలు

బంగారం కొనుగోళ్లు, విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్‌లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కూడా ప్రజలను కోరారు.

ఇక యూఏఈ ఇటీవల సౌదీ ఆధ్వర్యంలోని ఒపెక్‌ ప్లస్‌ కూటమి నుంచి బయటకు రావడం భారత్‌కు పెద్ద అవకాశంగా మారింది.

ఇప్పటివరకు ఒపెక్‌ పరిమితుల కారణంగా యూఏఈ పూర్తి స్థాయిలో చమురు ఉత్పత్తి చేయలేకపోయింది.

ఇప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి రావడంతో భారత్‌కు తక్కువ ధరల్లో దీర్ఘకాలిక చమురు సరఫరా ఒప్పందాలు చేసే అవకాశం ఏర్పడింది.

ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచ చమురు రవాణా దెబ్బతింటోంది.

ఈ నేపథ్యంలో హోర్ముజ్‌కు బయట ఉన్న ఫుజైరా పోర్టు భారత్‌కు కీలక మార్గంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

రూపాయి-దిర్హామ్ ట్రేడ్‌ వ్యవస్థ విస్తరణ

ఈ మార్గం ద్వారా సురక్షితంగా చమురు సరఫరా కొనసాగించడంపై మోదీ ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఈ పర్యటనలో మూడు కీలక ఒప్పందాలు ప్రధానంగా ఉండనున్నాయి.

మొదటిది వ్యూహాత్మక చమురు నిల్వల విస్తరణ. భారత్‌లోని మంగళూరు భూగర్భ నిల్వలను యూఏఈకి చెందిన ADNOC సంస్థతో నింపే ప్రణాళిక ఉంది.

రెండోది ఎల్పీజీ భద్రత ఒప్పందం. భారత్‌కు అవసరమైన ఎల్పీజీలో 40 శాతం ఇప్పటికే యూఏఈ నుంచే వస్తోంది.

ధరల పెరుగుదల ప్రభావం సామాన్య కుటుంబాలపై పడకుండా 10 ఏళ్ల స్థిర సరఫరా ఒప్పందం చేసుకునే అవకాశముంది.

మూడోది రూపాయి-దిర్హామ్ ట్రేడ్‌ వ్యవస్థ విస్తరణ. డాలర్‌ను పక్కన పెట్టి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులు జరపడం ద్వారా భారత్‌కు భారీగా విదేశీ మారక నిల్వలు ఆదా కానున్నాయి.

వివరాలు 

2032 నాటికి 200 బిలియన్ డాలర్లకు వాణిజ్యం

భారత్‌, యూఏఈ మధ్య ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లకు పైగా వాణిజ్యం కొనసాగుతోంది.

2032 నాటికి దీన్ని 200 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గ్రీన్ హైడ్రోజన్ రంగంలో కూడా రెండు దేశాలు కలిసి పనిచేసే అవకాశముంది.

ఇక యూఏఈలో నివసిస్తున్న 45 లక్షల మంది భారతీయుల భద్రత కూడా ఈ పర్యటనలో కీలక అంశంగా మారింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడి భారతీయుల సంక్షేమం, వారి ఉపాధి, విదేశీ మారక ద్రవ్య పంపకాల భద్రతపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

ADVERTISEMENT