Page Loader
మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి
ఆస్తులు నుండి రుణాలు తీసేస్తే నికర విలువ వస్తుంది

మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 01, 2023
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనలో చాలా మంది నికర విలువ గురించి పట్టించుకోరు కారణం ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం. కారణం ఏదైనా కావచ్చు, వ్యక్తిగత ఫైనాన్స్‌ను సమర్ధవంతంగా నిర్వహించడానికి నికర విలువను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆస్తులు (స్వంతం) నుండి రుణాలు ( చెల్లించాల్సినవి) తీసేస్తే నికర విలువ వస్తుంది. ఆస్తులలో నగదు, రియల్ ఎస్టేట్, స్టాక్‌లలో చేసిన పెట్టుబడులు, బాండ్‌లు మొదలైనవి ఉంటాయి. బాధ్యతలలో తనఖాలు, కారు రుణాలు, విద్యార్థి రుణాలు, క్రెడిట్ కార్డ్ రుణాలు మొదలైనవి ఉంటాయి. ఇది స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఉపయోగపడుతుంది. నికర విలువను తెలుసుకోవడం వలన మీరు ఖర్చును తగ్గించుకునే లేదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను గుర్తించడంలో సహాయపడుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించవచ్చు.

ఆదాయం

నికర విలువను తెలుసుకోవడం ద్వారా, పదవీ విరమణ లక్ష్యాలను సెట్ చేసుకోవచ్చు

మీ నికర విలువను దశల వారీగా ఎలా లెక్కపెట్టాలి 1. నగదు, పొదుపులు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, వాహనాలు, వ్యక్తిగత ఆస్తితో సహా అన్ని ఆస్తుల విలువను కలపాలి. వాటి ప్రస్తుత మార్కెట్ విలువలను ఉపయోగించాలి. 2. తనఖాలు, రుణాలు, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు సహా చెల్లించాల్సిన ఇతర రుణాలన్నిటిని కలపాలి. 3. చివరగా, నికర విలువను పొందడానికి మొత్తం ఆస్తుల నుండి మొత్తం రుణాలను తీసేయాలి. మీ నికర విలువను తెలుసుకోవడం ద్వారా, పదవీ విరమణ లక్ష్యాలను సెట్ చేసుకోవచ్చు. నికర విలువ ఆధారంగా పదవీ విరమణ తర్వాత మీకు ఎంత అవసరమో అంచనా వేయవచ్చు అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.