Page Loader
$50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ
మరింత దిగువకు గౌతమ్ అదానీ నికర విలువ

$50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 20, 2023
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అప్డేట్ చేసిన డేటా ప్రకారం అతని మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లు. 60 ఏళ్ల పారిశ్రామికవేత్త నికర విలువ ఒక నెల క్రితం సుమారు $120 బిలియన్లు ఉండేది. అతను అప్పుడే ప్రపంచంలోని అత్యంత సంపనుల్లో మూడవ స్థానంలో నిలిచారు. ఒక చిన్న US షార్ట్ సెల్లర్, హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్‌పై నివేదికను అందించిన తర్వాత అంతా మారిపోయింది. ఏడు ప్రధాన అదానీ గ్రూప్ సంస్థలు మొత్తంగా $120 బిలియన్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. పెట్టుబడిదారులలో, ఆర్థిక సంస్థలలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి.

అదానీ

గౌతమ్ అదానీ సేకరించిన వ్యక్తిగత సంపదపై తీవ్ర ప్రభావం పడింది

అందరి ఆందోళనల ఫలితంగా అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు దారుణంగా పతనమయ్యాయి. గౌతమ్ అదానీ సేకరించిన వ్యక్తిగత సంపదపై కూడా తీవ్ర ప్రభావం చూపింది, మొదట అతని సంపద $71 బిలియన్లు పడిపోయింది. అతని నికర విలువ వేగంగా పడిపోవడంతో, అదానీ $83.6 బిలియన్ల నికర విలువతో ఇండెక్స్‌లో 11వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీతో ఆసియాలో అత్యంత సంపన్నుడి స్థానాన్ని కూడా కోల్పోయారు. అయితే లిస్టెడ్ కంపెనీ స్టాక్‌ల విలువలో తీవ్ర క్షీణత వలన గౌతమ్ అదానీ మళ్ళీ ఆ స్థానానికి రావడానికి చాలా సమయం పట్టవచ్చు.