ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ
ప్రపంచంలోని ఫోర్బ్స్ ప్రపంచ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితాలో టాప్ 20 సంపన్నుల జాబితాలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. US షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన నివేదిక ఆ సంస్థ స్టాక్స్ ను దారుణంగా పడిపోయేలా చేసింది. శుక్రవారం 22వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ సంపద 21.77 శాతం అంటే 16.2 బిలియన్ డాలర్లు క్షీణించింది. శుక్రవారం మధ్యాహ్నం 1.23 గంటలకు (IST) పారిశ్రామికవేత్త ప్రస్తుత నికర విలువ USD 581.1 బిలియన్లు కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ నికర విలువ USD 82 బిలియన్లుగా ఉంది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్న ముకేష్ అంబానీ
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ 2023లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంబానీని అధిగమించిన తర్వాత గురువారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 10వ స్థానానికి పడిపోయారు మరింత దిగజారి జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నారు. ఫోర్బ్స్ ప్రకారం, గురువారం ఉదయం, అంబానీ 84.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్న భారతీయుడిగా అదానీని అధిగమించారు. అదానీ స్టాక్ లాభంలో ఉంటే, అదానీ వ్యక్తిగత సంపద కూడా పెరుగుతుందని అంచనా. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు శుక్రవారం ఉదయం 27.47 శాతం క్షీణించి రూ.1,143.50 వద్దకు చేరుకున్నాయి. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, కేవలం ఐదు సెషన్లలో, రూ. 1.926.55 కంటే ఎక్కువ నష్టపోయింది అంటే 62 శాతానికి పైగా క్షీణించింది.