NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన విండ్‌ఫాల్ టాక్స్
    కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన విండ్‌ఫాల్ టాక్స్
    బిజినెస్

    కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన విండ్‌ఫాల్ టాక్స్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    September 16, 2023 | 03:53 pm 1 నిమి చదవండి
    కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన విండ్‌ఫాల్ టాక్స్
    భారీగా పెరిగిన విండ్‌ఫాల్ టాక్స్

    విండ్ ఫాల్ టాక్స్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడాయిల్‌పై (ముడి చమురు) విండ్‌ఫాల్ టాక్స్ ను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇటీవలే టన్నుకు రూ.6700గా ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 10 వేలకు పెంచేసి షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 16 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. సెప్టెంబర్ 2న కేంద్రం క్రూడ్ పెట్రోలియంపై విండ్‌ఫాల్ టాక్స్‌ను టన్నుకు రూ.7100 నుంచి రూ.6700 కు తగ్గించింది. అయితే మరో 15 రోజులకే భారీగా పెంచడం గమనార్హం. మరోవైపు విమాన ఇంధనంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని(SAED)మాత్రం తగ్గిస్తున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ATFపై లీటర్‌కు రూ. 4గా ఉన్న పన్నును రూ. 3.50కి తగ్గించింది.

    2022, జులై 1న తొలిసారిగా విండ్ ఫాల్స్ టాక్స్ 

    డీజిల్ ఎగుమతులపైనా ఎస్‌ఏఈడీ(SAED)ని కేంద్రం తగ్గించింది. గతంలో లీటర్‌కు రూ. 6గా ఉంది. తాజా నిర్ణయంతో రూ. 5.50కి పడిపోయింది. పెట్రోల్ ఎగుమతులపై జీరో టాక్స్ వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది. విండ్‌‌ఫాల్ టాక్స్ విధానాన్ని తొలిసారిగా 2022, జులై 1న ప్రవేశపెట్టింది. దేశీయంగా చమురును వెలికితీసి, ఉత్పత్తిచేసి విక్రయిస్తున్న ఆయిల్ కంపెనీలపై ఈ పన్నును కేంద్రం విధిస్తుంది. గతేడాది రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ముడిచమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే భారత ఆయిల్ కంపెనీలు విదేశాలకు పెద్ద ఎత్తున క్రూడాయిల్ ఎగుమతి చేసి లాభాలను సాధించాయి. స్వదేశంలో విక్రయించకుండా, విదేశాలకు అమ్ముకుంటున్న కారణంగానే కేంద్రం తాజాగా అడ్డుకట్ట కట్ట వేసేందుకు విండ్‌ఫాల్ టాక్స్ విధిస్తోంది.

    హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రేట్ రూ.109.64, డీజిల్ రూ.97.80 

    అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు రేటు భారీగా పెరిగింది. ఈ మేరకు బ్యారెల్ ముడిచమురు 90 డాలర్లుగా ఉండగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 93.7 డాలర్లుగా కొనసాగుతోంది. దీంతో దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే కంపెనీలకు కేంద్రం నిర్ణయం ఝలక్ ఇచ్చింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలోనే ఉండటం గమనార్హం. గత మే నుంచి దేశంలో ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ, నష్టాలను పూడ్చుకునేందుకు ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించలేదు. ఇవాళ హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.64గా ఉంది. లీటర్ డీజిల్ కు రూ. 97.80 ధర పలుకుతోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కేంద్ర ప్రభుత్వం
    చమురు

    కేంద్ర ప్రభుత్వం

    రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్లీపర్ కోచ్‌లతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ముస్తాబు రైల్వే శాఖ మంత్రి
    ఉజ్వల స్కీమ్ కింద 75 లక్షల కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్
    అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ  ప్రియాంక గాంధీ
    G-20 సమావేశానికి భారత్ భారీ వ్య‌యం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు భారతదేశం

    చమురు

    అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి?  తాజా వార్తలు
    Gas Cylinder price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు  వాణిజ్య సిలిండర్
    గ్యుడ్‌న్యూస్: ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 తగ్గనున్నాయ్ పెట్రోల్
    మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం తాజా వార్తలు
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023