Zomato: జొమాటో ఏజెంట్‌ను ఢీకొట్టిన కారు.. రక్షించిన మహిళ
దిల్లీలో ఇటీవల ఫుడ్ డెలివరీ బాయ్ ని రెండు కార్లు ఢీకొట్టాయి. వెంటనే గుర్తించిన ఓ మహిళ జొమాటో డెలవరీ బాయ్ ని రక్షించింది. Zomato అత్యవసర సేవను సంప్రదిస్తే, అటునుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ ఘటన మొత్తాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అయింది. ఇప్పటికే ఆ వీడియోను ఆరు లక్షలమందికి పైగా వీక్షించారు. డెలివరీ భాగస్వాముల పట్ల జొమాటో వ్యవహరించిన తీరుపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
రైడర్లకు తగిన హక్కులను కల్పించాలి
ఢిల్లీలోని చాణక్యపురిలో జొమాటో డెలివరీ ఏజెంట్‌ను లాలన్‌ను రెండు కార్లు ఢీకొట్టడాన్ని తాను చూశానని అంజలి నివేదించింది. ఇ-స్కూటర్ నడుపుతున్న లాలన్‌కు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అంజలి, మరో ఇద్దరు జొమాటో ఏజెంట్‌లతో కలిసి, గాయపడిన రైడర్‌కు Zomato అత్యవసర సేవను సంప్రదిస్తే సాయం చేయడానికి ముందుకు రాలేదన్నారు. జొమాటో తన రైడర్‌లకు మద్దతు ఇవ్వడం లేదని అంజలి విమర్శలు గుప్పించింది. ఆమె సోషల్ మీడియాలో ఇలా రాసింది. రైడర్లు ఉద్యోగులుగా గుర్తించి వారికి తగిన హక్కులు, న్యాయమైన పరిహారం ఇవ్వాలని ఆమె CEO దీపిందర్ గోయల్‌ను కోరారు.