Loading...
Job insurance: AI వల్ల ఉద్యోగం పోతుందనే భయమా? డోంట్ వర్రీ.. జాబ్ ఇన్సూరెన్స్‌తో ఆర్థిక భరోసా ఉందిగా..!
డోంట్ వర్రీ.. జాబ్ ఇన్సూరెన్స్‌తో ఆర్థిక భరోసా ఉందిగా..!

Job insurance: AI వల్ల ఉద్యోగం పోతుందనే భయమా? డోంట్ వర్రీ.. జాబ్ ఇన్సూరెన్స్‌తో ఆర్థిక భరోసా ఉందిగా..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తుండటంతో ఉద్యోగులలో ఆందోళన పెరుగుతోంది. ఏఐ కారణంగా తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయోనని చాలామంది భయపడుతున్నారు. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, ఇతర ఆర్థిక బాధ్యతలు ఎలా నిర్వహించాలనే ప్రశ్న ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ ఇన్సూరెన్స్ కొంతవరకు ఆర్థికంగా ఆదుకోవచ్చు. అయితే, ఉద్యోగం కోల్పోయిన కారణం పాలసీ నిబంధనల పరిధిలోకి వస్తేనే బీమా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

వివరాలు 

టెక్ రంగంలో ఉద్యోగాల కోత.. రోజుకు 642 మంది ఇంటికి

TrueUp గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో 742 సంస్థలు ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి.

వీటి ద్వారా మొత్తం 2,09,841 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఏడాది టెక్ కంపెనీలు రోజుకు సగటున 642 మంది ఉద్యోగులను తొలగించాయి.

2025లో ఈ సంఖ్య రోజుకు 579గా ఉంది. అయితే, ఈ గణాంకాల్లో ఏఐ కారణంగా జరిగిన తొలగింపులతో పాటు ఇతర కారణాలతో జరిగిన ఉద్యోగాల కోతలు కూడా ఉన్నాయి.

వివరాలు 

జాబ్ ఇన్సూరెన్స్ పొందడానికి అర్హతలు ఏమిటి?

భారత్‌లో జాబ్ ఇన్సూరెన్స్‌ను ప్రత్యేక పాలసీగా కాకుండా, ఇతర బీమా పాలసీలకు అదనపు కవరేజీగా అందిస్తున్నారు.

హోమ్ ఇన్సూరెన్స్,ప్రమాద బీమా లేదా క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలతో కలిపి ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇంటి రుణ వాయిదాలు (ఈఎంఐలు), ఇతర ఆర్థిక బాధ్యతలు చెల్లించేందుకు ఈ బీమా ఉపయోగపడుతుంది.

కొత్త ఉద్యోగం వెతుక్కునే సమయంలో గరిష్ఠంగా మూడు నెలల వరకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది.

సాధారణంగా రిజిస్టర్డ్ కంపెనీలో జీతం తీసుకుంటూ పనిచేసే ఉద్యోగులు మాత్రమే ఈ బీమాకు అర్హులు.

స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ కవరేజీ వర్తించదు.అలాగే తాత్కాలిక ఉద్యోగులు,సీజనల్ వర్కర్లు,కాంట్రాక్టు ఉద్యోగులు,రోజువారీ కూలీలకు కూడా ఈ బీమా ప్రయోజనం అందుబాటులో ఉండదు.

ADVERTISEMENT

వివరాలు 

ఉద్యోగం కోల్పోయే కారణాన్ని బట్టి బీమా వర్తింపు

అయితే, అదనపు కవరేజీని కొనుగోలు చేయడానికి అర్హత ఉన్నప్పటికీ.. క్లెయిమ్ చేసే సమయంలో కొన్ని పరిమితులు ఎదురుకావచ్చు.

ఉద్యోగం కోల్పోవడానికి గల కారణం కూడా చాలా ముఖ్యం. కొన్ని బీమా పాలసీలు తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా ఏర్పడిన వైకల్యం వల్ల ఉద్యోగం కోల్పోతే కవరేజీ కల్పిస్తాయి.

కొన్ని నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి తొలగించడం లేదా తాత్కాలికంగా విధుల నుంచి తప్పించడం వంటి సందర్భాల్లోనూ బీమా ప్రయోజనం లభించవచ్చు.

ఏఐ వల్ల ఉద్యోగం పోయినప్పుడు కూడా బీమా వర్తిస్తుందా? అనేది పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపులకు ఏఐని ప్రత్యక్ష కారణంగా వెల్లడించవు.

అందువల్ల ఇలాంటి తొలగింపులను సాధారణ ఉద్యోగ తొలగింపులుగానే పరిగణించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

జాబ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కు వర్తించే నిబంధనలివే..

అయితే, క్లెయిమ్ ఆమోదం పొందుతుందో లేదో తెలుసుకోవడానికి పాలసీలోని నిబంధనలను పరిశీలించాలి.

బీమా ప్రారంభమైన తర్వాత సాధారణంగా 30 నుంచి 90 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

ఈ సమయంలో ఉద్యోగం కోల్పోతే బీమా సొమ్ము అందకపోవచ్చు.

ప్రొబేషన్ సమయంలో ఉద్యోగం పోయినా కవరేజీ వర్తించదు. ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినా, పదవీ విరమణ చేసినా బీమా ప్రయోజనం లభించదు.

పనితీరు సరిగా లేకపోవడం, మోసం లేదా నిజాయతీ లోపం వంటి కారణాలతో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించినా క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

అందుకే జాబ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు ఉద్యోగ నష్టానికి సంబంధించిన నిబంధనలను పూర్తిగా చదవాలి.

వివరాలు 

జాబ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కు వర్తించే నిబంధనలివే..

కంపెనీ ఏ కారణంతో ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు బీమా వర్తిస్తుందో తెలుసుకోవాలి.

ముఖ్యంగా కంపెనీ ఇచ్చే టెర్మినేషన్ లెటర్‌లో పేర్కొన్న కారణాలు, పాలసీ నిబంధనలకు సరిపోతున్నాయో లేదో పరిశీలించాలి.

క్లెయిమ్ ఆమోదానికి ఈ లేఖ కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది.

వివరాలు 

జాబ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?

ఒకవేళ ఉద్యోగం కోల్పోతే ముందుగా బీమా సంస్థకు రాతపూర్వకంగా సమాచారం అందించాలి.

ఉద్యోగం కోల్పోయినట్లు నిరూపించే పత్రాలతో పాటు సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్, కంపెనీ ఇచ్చిన టెర్మినేషన్ లెటర్‌ను సమర్పించాలి.

ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారనే వివరాలను తెలియజేసే మరికొన్ని పత్రాలను కూడా బీమా సంస్థ అడగవచ్చు.

అందువల్ల గత మూడు నెలల జీతం స్లిప్పులు, ఫామ్ 16, కంపెనీ సంప్రదింపు వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

వీటితో పాటు బీమా పాలసీ కాపీ, గుర్తింపు పత్రం, వయసును నిరూపించే ధ్రువీకరణ పత్రాలు కూడా అవసరం కావచ్చు.

వివరాలు 

జాబ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?

సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే బీమా సంస్థ క్లెయిమ్‌పై నిర్ణయం తీసుకుంటుంది.

అర్హత ఉన్న సందర్భాల్లో కొన్ని పాలసీలు ఒకేసారి కాకుండా నిర్ణీత వ్యవధిలో విడతల వారీగా డబ్బులు చెల్లిస్తాయి.

కాబట్టి బీమాపై ఆధారపడే ముందు ఎంత మొత్తం వస్తుంది? ఎన్ని నెలల పాటు చెల్లిస్తారు? అనే వివరాలను తెలుసుకోవాలి.

ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకోవాలంటే జాబ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడవచ్చు.

అయితే, అన్ని రకాల ఉద్యోగ తొలగింపులకు ఇది వర్తించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ADVERTISEMENT