
Gold Rates: వామ్మో.. ఒక్కరోజులో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ముఖ్యంగా 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల స్థాయిని చేరుకునేలా పరుగులు పెడుతోంది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,500 పెరిగి రూ.90,250కి చేరింది.
అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,730 పెరిగి రూ.98,460గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.2,040 పెరిగి రూ.73,840కు చేరింది.
Details
ఢిల్లీ, ముంబైలో బంగారం ధరలు
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,500 పెరిగి రూ.90,400 కాగా, 24 క్యారెట్ల ధర రూ.2,730 పెరిగి రూ.98,610కి చేరింది.
18 క్యారెట్ల బంగారం ధర రూ.2,050 పెరిగి రూ.73,970గా నమోదైంది. మరోవైపు ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,250గా ఉంది.
ఇది కూడా రూ.2,500 పెరుగుదలకు గురైంది. 24 క్యారెట్ల ధర రూ.98,460కాగా, 18 క్యారెట్ల ధర రూ.73,840గా ఉంది. ఇక్కడి ధరలు కూడా వరుసగా రూ.2,730, రూ.2,040 మేరకు పెరిగినవే.
Details
వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల
ఇక వెండి ధరలు మాత్రం కొద్దిగా తగ్గాయి. దేశంలో ఇవాళ ఉదయం వెండి ధర రూ.100 తగ్గింది. వివిధ నగరాల్లో ప్రస్తుతం వెండి ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్ : కిలో వెండి ధర రూ.1,07,900
విజయవాడ: కిలో వెండి ధర రూ.1,07,900
విశాఖపట్నం: కిలో వెండి ధర రూ.1,07,900
ఢిల్లీ: కిలో వెండి ధర రూ.1,00,500
ముంబై : కిలో వెండి ధర రూ.1,00,500