Year Ender 2024: పెరిగిన UPI పరిమితి.. యూపీఐలో టాప్-5 బిగ్ ఛేంజెస్
భారతదేశంలో డిజిటల్ విప్లవం అనేక సంచలనాత్మక మార్పులను తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో పాటు డిజిటల్ లావాదేవీల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో దేశంలో అత్యధికంగా ఉపయోగించబడుతున్న డిజిటల్ చెల్లింపు పద్ధతి యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) అని చెప్పొచ్చు. 2024లో యూపీఐ వ్యవస్థ అనేక ముఖ్యమైన మార్పులను చూసింది.
2024 నవంబర్ వరకు UPI లావాదేవీల రికార్డు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం,నవంబర్ 2024 నాటికి యూపీఐ ద్వారా 15,482 మిలియన్ లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ. 21,55,187.4 కోట్లుగా నమోదైంది. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా మార్చడానికి యూపీఐ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు ఆగస్టులో NPCI ప్రత్యేక కేటగిరీల కోసం ఒక్కో లావాదేవీ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చెల్లింపులు, అలాగే IPO లేదా రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌కు దరఖాస్తులు చేస్తే రూ. 5 లక్షల పరిమితి వర్తిస్తుంది. బీమా,స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన లావాదేవీలకు రూ. 2 లక్షల పరిమితి నిర్ణయించారు.
యూపీఐ లైట్ పరిమితి పెంపు
ఆర్బీఐ ఈ సంవత్సరం UPI లైట్ వాలెట్ పరిమితిని రూ. 2,000 నుంచి రూ. 5,000కి పెంచింది. చిన్న విలువల లావాదేవీలకు యూపీఐ లైట్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. పిన్ అవసరం లేకుండా రూ. 1,000 వరకు లావాదేవీలు చేయడం వీలవుతుంది. ఇదివరకు ఈ పరిమితి రూ. 500గా ఉండేది. UPI123PAY పరిమితి పెంపు ఇంటర్నెట్ లేదా స్మార్ట్‌ఫోన్ లేని వినియోగదారులకు యూపీఐ సేవలు అందించేందుకు UPI123PAY పరిచయం చేయబడింది. ఈ సేవల పరిధిని రూ. 5,000 నుండి రూ. 10,000కి పెంచారు. వినియోగదారులు మిస్డ్ కాల్ లేదా IVR నంబర్ డయల్ చేయడం ద్వారా లావాదేవీలు సులభంగా చేయవచ్చు.
UPI సర్కిల్ సదుపాయం
NPCI ఈసంవత్సరం కొత్తగా UPI సర్కిల్ ను ప్రవేశపెట్టింది.ఒక ప్రాథమిక వినియోగదారు తన బ్యాంక్ ఖాతా ద్వారా గరిష్టంగా ఐదుగురు వినియోగదారులకు లావాదేవీలు చేసే సౌకర్యాన్నిఈ సర్కిల్ ద్వారా అందించారు.రెండవ వినియోగదారులకు నెలకు గరిష్టంగా రూ.15,000 పరిమితిని,ఒక్కో లావాదేవీకి రూ.5,000 పరిమితిని నిర్ణయించారు. యూపీఐ లైట్ వాలెట్ ఆటో టాప్-అప్ 2024 జూన్‌లో RBI యూపీఐలైట్ వాలెట్ కోసం ఆటోమేటిక్ టాప్-అప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఖాతా నుండి లైట్ వాలెట్‌కు డబ్బు బదిలీకి అదనపు ధృవీకరణ అవసరం లేకుండా ప్రక్రియను సులభతరం చేశారు.ఈమార్పుతో యూపీఐ లైట్ వాలెట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా టాప్-అప్ అవుతుంది. ఈమార్పులన్నీయూపీఐ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించడంతో పాటు డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.