LOADING...
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్.. ఇక ఫేస్ ఐడీ, ఫింగర్‌ప్రింట్‌తోనే యూపీఐ చెల్లింపులు
పేటీఎంలో కొత్త ఫీచర్.. ఇక ఫేస్ ఐడీ, ఫింగర్‌ప్రింట్‌తోనే యూపీఐ చెల్లింపులు

Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్.. ఇక ఫేస్ ఐడీ, ఫింగర్‌ప్రింట్‌తోనే యూపీఐ చెల్లింపులు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 06, 2026
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ చెల్లింపుల్లో ముందంజలో ఉన్న పేటియం మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఐ లావాదేవీలు, కార్డ్‌లెస్ ఏటీఎం విత్‌డ్రాయల్స్ కోసం బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇకపై యూజర్లు తమ ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడీ ద్వారా సులభంగా ట్రాన్సాక్షన్లు ధృవీకరించవచ్చు. ఈ నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినమైన టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో తీసుకుంది. ముఖ్యంగా బయోమెట్రిక్స్ వంటి డైనమిక్, డివైస్ ఆధారిత భద్రతా పద్ధతులను ప్రోత్సహిస్తూ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు

భద్రత కోసమే ఏర్పాట్లు..

ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తిగా యూజర్ డివైస్‌లోనే జరుగుతుంది. దీంతో యూజర్ల బయోమెట్రిక్ డేటాను పేటీఎం లేదా బ్యాంకులు ఎక్కడా నిల్వ చేయవు. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీలు ఒక్కసారి గరిష్టంగా రూ.5,000 వరకు మాత్రమే చేయగలుగుతారు. ఈ కొత్త ఫీచర్ డిజిటల్ చెల్లింపులను మరింత భద్రంగా, సులభంగా మార్చే ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చారు.

వివరాలు

కార్డ్ లేకుండానే డబ్బు డ్రా..

యూపీఐ ట్రాన్సాక్షన్లతో పాటు, కార్డ్‌లెస్ ఏటీఎం విత్‌డ్రాయల్స్ కూడా ఇప్పుడు మరింత సులభమయ్యాయి. ఏటీఎంలో స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఫేస్ ఐడీ లేదా ఫింగర్‌ప్రింట్ లేదా యూపీఐ పిన్‌తో ధృవీకరిస్తే చాలు—డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే నగదు తీసుకోవచ్చు. ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లలో అందుబాటులో ఉన్నాయి. యూజర్లు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను లింక్ చేసుకోవచ్చు. అవసరమైతే యూపీఐ పిన్ ఉపయోగించే ఆప్షన్ కూడా అలాగే ఉంటుంది. యూజర్లకు మరింత సౌకర్యవంతమైన, భద్రమైన డిజిటల్ చెల్లింపులు అందించడమే పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement