భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు సిఈఓ శ్రీధర్ వెంబు, $4.5 బిలియన్ల విలువైన వ్యాపార సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ (ఫోర్బ్స్ ప్రకారం), తన మాజీ భార్య ప్రమీలా శ్రీనివాసన్‌తో విడాకుల పోరాటంలో ఉన్నారు. యుఎస్‌లో దాదాపు 25 ఏళ్లు గడిపిన తర్వాత వెంబు 2020 నుండి భారతదేశంలో ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులోని మఠలంపరై గ్రామంలో నివసిస్తున్నారు. గ్రామీణ కార్యక్రమాలను ప్రారంభించడానికి, ఉపాధిని కల్పించడానికి భారతదేశానికి వెళ్లినట్లు అతను చెప్పారు. అతని ప్రయత్నాలకు పద్మశ్రీతో సహా అనేక ప్రశంసలను పొందాయి. శ్రీనివాసన్, వెంబు వివాహం 29 సంవత్సరాల క్రితం జరిగింది. కాలిఫోర్నియాలో విడాకుల కేసులో, వెంబు తనకు చెప్పకుండా తన సోదరికి, ఆమె భర్తకు కంపెనీలో తన వాటాలో కొంత భాగాన్ని బదిలీ చేశారని ప్రమీల ఆరోపించారు.
భార్య చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన శ్రీధర్
శ్రీధర్ మూడు సంవత్సరాల క్రితం తన స్పెషల్ కిడ్ ని విడిచిపెట్టాడని ఆమె కోర్టు ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే ఆరోపణలను తోసిపుచ్చుతూ కంపెనీలోని నా షేర్లను ఎప్పుడూ ఎవరికీ బదిలీ చేయలేదని అతను చెప్పారు. భార్య, కొడుకును విడిచిపెట్టిన ఆరోపణలను వెంబు ఖండించారు. అతను భారతదేశానికి వెళ్ళిన తర్వాత వారి మధ్య సయోధ్య గురించి ఆశలు మహమ్మారి కారణంగా ఆవిరైపోయాయి. వెంబు తన ట్విట్టర్ పోస్ట్‌లో, ఈ గొడవంతా మా బాబాయి రామ్ వల్లే జరిగిందని అన్నారు.