Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో
ఆర్బీఐ రూ. 2000నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకు తర్వాత నగదు చెల్లింపులు భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేర్కొంది. అది కూడా 72శాతం మంది రూ.2వేల నోట్లతో కాష్ ఆన్ డెలివరీ పేమెంట్లు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. శుక్రవారం నుంచి తమ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లలో 72శాతం రూ.2000నోట్లలోనే చెల్లింపులు జరుగుతున్నాయని వెల్లడించింది. జొమాటో తన ట్వీట్‌కు బ్రేకింగ్ బాడ్ రిఫరెన్స్ మీమ్‌ను జత చేసింది. బ్రేకింగ్ బాడ్ క్యారెక్టర్ హుయెల్ బాబినోక్స్ జొమాటో టీ-షర్టును ధరించి, రూ.2వేల నోట్లపై పడుకున్నట్లు ఉన్న ఆ మీమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది పోస్ట్ చేసినప్పటి నుంచి 19,000పైగా లైకులు, 1,400కి పైగా రీట్వీట్‌లను పొందింది.