Page Loader
Zomoto: జొమాటోలో న్యూ ఫీచర్.. ఇక ఆర్డర్‌ని 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం
జొమాటోలో న్యూ ఫీచర్.. ఇక ఆర్డర్‌ని 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం

Zomoto: జొమాటోలో న్యూ ఫీచర్.. ఇక ఆర్డర్‌ని 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2024
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ సంస్థ జొమాటో సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో కస్టమర్లు ఆర్డర్లను ముందే 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం ఉంటుంది. ఫుడ్ ఆర్డర్లను రెండు రోజుల ముందుగానే షెడ్యుల్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ప్రస్తుతం కొన్ని భారతీయ నగరాలలో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ని లాంచ్ చేస్తున్నట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తాము నిర్ణీత సమయం లోపలే డెలవరీ చేస్తామని ఆయన వెల్లడించారు.

Details

13,000 రెస్టారెంట్లలో 'షెడ్యూల్' ఫీచర్

ప్రస్తుతం దిల్లీ ఎన్​సీఆర్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, జైపూర్​లోని సుమారు 13,000 రెస్టారెంట్లలో ఈ సర్వీస్​ అందుబాటులో ఉందని గోయల్ తెలిపారు. రెండు రోజుల ముందే ఆర్డర్ ఇవ్వడం ద్వారా మీ ఫుడ్ ని బాగా ప్లాన్ చేసుకొనే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ధరతో సంబంధం లేకుండా అన్ని ఆర్డర్లకు అందుబాటులో ఉంటుందని, ఈ ఫీచర్‌ని మరింతగా విస్తరించామని సీఈఓ పేర్కొన్నారు. అయితే ఈ కొత్త ఫీచర్​పై నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూలింగ్​ ఫీచర్​తో ఫుడ్​ని వేడివేడిగా వండి ఇస్తారన్న నమ్మకం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.