
Zomato: మళ్లీ పెరిగిన జొమాటో ఆదాయం.. ఈసారి రూ.253 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఐదేళ్ల క్రితం ప్రారంభమైన జొమాటో కంపెనీ ఇప్పుడు వేల కోట్ల పైగా టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. తాజాగా త్రైమాసిక ఫలితాలను జొమాటో ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికంలో ఆ కంపెనీ కాన్సాలిడేటెడ్ లాభం రూ. 2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు (Y0Y) చేరుకుంది.
కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 74శాతం పెరిగి రూ.4,206 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గతేడాది రూ.194 కోట్లు లభించాయి.
ఇదే సమయంలో గతేడాది జొమాటో మొదటిసారి రూ. 2 కోట్ల నికర లాభంతో రూ.2,416 ఆదాయాన్ని ఆర్జించింది.
Details
జొమాటో షేర్ విలువ రెట్టింపు
మరోవైపు ఫుడ్ డెలవరీ, క్విక్ కామర్స్ విభాగంలోనూ లాభాలను పొందింది.
ఆర్డర్ల విలువ 53 శాతం వృద్ధి చెందడంతో రూ.15, 455 కోట్లకు చేరిందని జొమాటో వెల్లడించింది.
ఫుడ్ డెలవరీ విభాగంలో ఏడాదికి 27శాతం పెరిగితే క్విక్ కామర్స్‌లో 130శాతం వృద్ధి నమోదైంది
. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 3.68శాతం పెరిగి రూ.237.90 వద్ద స్థిరపడింది.