Zomato Q3 results: జొమాటో ఆదాయం 64% పెరిగింది.. లాభాల్లో మాత్రం క్షీణిత
ఈ వార్తాకథనం ఏంటి
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.59 కోట్లుగా పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే, లాభంలో 57.2 శాతం క్షీణించడాన్ని గమనించవచ్చు.
గతేడాది ఈ త్రైమాసికంలో జొమాటో రూ.138 కోట్ల నికర లాభాన్ని ప్రకటించినప్పుడు, గత త్రైమాసికంలో రూ.176 కోట్ల లాభం నమోదైంది.
కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 64 శాతం పెరిగి, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3288 కోట్లుండగా, ఈ సారి రూ.5405 కోట్లకు పెరిగింది.
కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఖర్చులు కూడా రూ.3,383 కోట్ల నుంచి రూ.5,533 కోట్లకు పెరిగినట్లు తెలిపింది.
Details
క్విక్‌కామర్స్ విభాగం ఆదాయం 117శాతం పెంపు
జొమాటో షేరు రోజంతా లాభాల్లో ఉన్నా ఫలితాల అనంతరం బీఎస్‌ఈలో 7 శాతం మేర క్షీణించి, రూ.230.70 వద్ద ముగిసింది. విభాగాల వారీగా, ఫుడ్ డెలివరీ వ్యాపారం నుండి వచ్చే ఆదాయం రూ.2413 కోట్ల నుంచి రూ.2602 కోట్లకు పెరిగింది.
నెలలో సగటున ఫుడ్ డెలివరీ చేసే వారి సంఖ్య క్రితం త్రైమాసికంతో పోలిస్తే 20.7 మిలియన్ల నుంచి 20.5 మిలియన్లకు తగ్గింది.
క్విక్‌కామర్స్ విభాగం, బ్లింకిట్ ఆదాయం 117 శాతం పెరిగి, రూ.1399 కోట్లకు చేరింది.
క్యూ3లో సగటు ఆర్డర్ విలువ రూ.707గా ఉన్నా గతేడాది ఇది రూ.635గా ఉన్నది.
జొమాటో గోయింగ్‌ఔట్ వ్యాపారం నుండి రూ.254 కోట్లు, హైపర్ ప్యూర్‌వ్యాపారం నుండి రూ.1671 కోట్లు ఆదాయం వచ్చినట్లు కంపెనీ తెలిపింది.